టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్.రమణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. 12 మందిలో ఏడుగురు కొత్తవారికి స్థానం కల్పించారు. వీటిలో బీసీలకు 4, ఓసీలకు 7, ఎస్సీలకు 1 కేటాయించారు. 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు సోమవారం ఉదయం నామినేషన్ వేయనున్నారు. ఎల్లుండితో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ముగియనుంది.
Read Also: వాట్సాప్‌లో ఫైల్ పంపుతున్నారా? ఈ విషయం మీకు తెలుసా?
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మంలో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చారు. మహబూబ్‌నగర్‌లో ఒకరికి, కరీంనగర్‌లో ఒకరికి కొత్తవారికి అవకాశం కల్పించారు. కాగా ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులలో ఎల్.రమణకు ఛాన్స్ ఇచ్చారు. హుజూరాబాద్ ఎన్నికల ముందే.. ఎల్ . రమణ టీడీపీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. బీసీ నేత, కరీంనగర్ జిల్లా కావడంతో ఎల్.రమణ ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కింది. ఖమ్మం నుంచి తాత మధు, ఆదిలాబాద్ నుంచి దండె విఠల్, మహబూబ్‌నగర్-2 నుంచి సాయిచంద్, కరీంనగర్-2 నుంచి ఎల్.రమణ, నల్గొండ నుంచి కోటిరెడ్డి, మెదక్ నుంచి యాదవ్‌రెడ్డి, నిజామాబాద్ నుంచి ఆకుల లలితకు కొత్తగా అవకాశం కల్పించారు. మహబూబ్ నగర్ -1 నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, కరీంనగర్-1 నుంచి భానుప్రసాద్, రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైంది. సిట్టింగ్ ఎమ్మెల్సీలలో పురాణం సతీష్, నారదాసు, దామోదర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, చిన్నపరెడ్డి, కవిత స్థానాలు గల్లంతయ్యాయి.
తాజావార్తలు
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
Ind Vs WI: భారత్‌ను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాం.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
ట్రెండింగ్
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!