ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం సులువేమీ కాదు: కిషన్‌రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కన్నుల పండువగా జరుగుతున్న కోటి దీపోత్సవం కార్యక్రమం 10వరోజుకు చేరింది. 10వ రోజు జరిగిన కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా వైభవంగా నిర్వహించడం అంత సులువేమీ కాదని.. కానీ అసాధ్యాన్ని నరేంద్ర చౌదరి సుసాధ్యం చేశారని కిషన్‌రెడ్డి కొనియాడారు.
అంతేకాకుండా దేవుడి మీద భారం వేసి.. భక్తి టీవీ సిబ్బందిని ఏకం చేసి కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తున్న నరేంద్ర చౌదరికి ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ ఏడాది తమ బీజేపీ ప్రభుత్వం ఆజాద్ కా అమృత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని.. ఇదే కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలను జరుపుకుంటున్నామని తెలిపారు. కరోనా కారణంగా ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కిషన్‌రెడ్డి సూచించారు. తాము కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తున్నామని.. ఇంకా ఎవరైతే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోలేదో వారు ఇప్పటికైనా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. అనంతరం ఆయన స్వరూపానందేంద్ర సరస్వతి స్వామితో కలిసి దీపార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read
తాజావార్తలు
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!