హైదరాబాద్ నగరంలోని లిబర్టీ వద్ద జీహెచ్‌ఎంసీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో బీజేపీ కార్పొరేటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫర్నీచర్, పూలకుండీలు ధ్వంసం చేసినందుకు 10 మంది కార్పొరేటర్లపై కేసులు నమోదయ్యాయి. కాగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలంటూ మంగళవారం మధ్యాహ్నం జీహెచ్‌ఎంసీ ఆఫీస్ వద్ద బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ ఛాంబర్‌లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని బీజేపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. ఎన్నికల కోడ్ ఉన్నందున […]
దేశరాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఉప రాష్ట్రపతి అధికారిక నివాసాన్ని నిర్మించేందుకు కేటాయించిన స్థలంపై సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ ప్రాజెక్టు కోసం కేటాయించిన భూమి వినియోగాన్ని మార్చడానికి గల కారణాలను సంబంధిత అధికారులు వివరించారని, ఈ వివరణ సమర్థనీయంగా ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ప’. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘పుష్ప ది రైజ్’ డిసెంబర్ 17న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పుష్ప సందడి మాములుగా ఉండటం లేదు. ఇప్పటికే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్, లిరికల్ సాంగ్స్, పోస్టర్స్, గెటప్స్ ఇలా ఒక్కటి అని కాకుండా ప్రతిదీ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీజర్ అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ […]
టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మంగళవారం రోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించాడు. సంపూ నటించిన లేటెస్ట్ మూవీ ‘క్యాలీఫ్లవర్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కాకినాడ, రాజమండ్రిలో చిత్ర యూనిట్ నిర్వహించింది. దీంతో బర్నింగ్ స్టార్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అభిమానులు సంపూర్ణేష్‌కు ఘన స్వాగతం పలికారు. పలువురు అభిమానులు సంపూ ఫేస్ మాస్కులు ధరించి సర్‌ప్రైజ్ చేశారు. Read Also: బుల్లితెరపై ఐకాన్ స్టార్ సందడి.. తగ్గేదే లే..!! ఈ కార్యక్రమం అనంతరం […]
కడప జిల్లాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితుల నుంచి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. వరదల్లో మృతిచెందిన కుటుంబాలకు టీడీపీ తరఫున రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించారు. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు రూ.1000 ఇస్తామని చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు… భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమని ఆరోపించారు. Read Also: విధ్వంసానికి.. సీఎం జగన్ బ్రాండ్ […]
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో ఈడీ దూకుడు పెంచింది. తాజాగా రూ.144 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ఇందులో 131 ఆస్తులు ఉన్నాయని వారు వెల్లడించారు. హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, చెన్నైలలో 97 ప్లాట్లు, ఆరు విల్లాలు, 18 కమర్షియల్ షాపులను మనీ లాండరింగ్ కింద అటాచ్ చేసినట్లు వారు వివరించారు. వీటిలో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, శ్రీహరిబాబు, రాజేశ్వర్‌రెడ్డి, కె.పద్మ, నాగలక్ష్మీ ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు. ఆస్తులే కాకుండా […]
ఏపీలో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమిళనాడు వద్ద వాయుగుండం తీరం దాటడంతో ఏపీ సరిహద్దు జిల్లాలలో కుంభవృష్టి వానలు కురిశాయి. దీంతో వరదలు పోటెత్తడంతో చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ప్రజా జీవనం స్తంభించింది. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన… ఇప్పుడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈసారి కూడా నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపైనే ప్రభావం ఉంటుందని వాతావరణ […]
హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో మంగళవారం రోజు ఓ యువకుడు హద్దు మీరి ప్రవర్తించాడు. సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు. ఎన్‌క్లోజర్ పై నుంచి సింహం బోనులోకి దూకేందుకు యువకుడు యత్నించగా… జూపార్క్ సిబ్బంది అతడిని గమనించారు. దీంతో యువకుడు సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకకుండా సిబ్బంది నిలువరించారు. అయితే ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడి కోసం సింహం ఆశగా ఎదురుచూసిందని.. యువకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించిందని జూపార్క్ సిబ్బంది వెల్లడించారు. ఒకవేళ తాము వెంటనే […]
కడప జిల్లాలో అధికార పార్టీ వైసీపీకి షాక్ తగిలింది. కాజీపేట మండలంలో ఏకంగా 13 మంది సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వారు పత్రికా ప్రకటన విడుదల చేశారు. సంక్షేమ పథకాల అమలులో సర్పంచుల పాత్ర లేకుండా చేయడమే కాక… 14వ, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా అధికారులు దారి మళ్లిస్తున్నారని వారు ఆరోపించారు. దీంతో ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు వారు వెల్లడించారు. ఈ […]
ఈటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ షో ‘ఢీ’ సిరీస్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 12 సీజన్‌లు విజయవంతంగా ముగిశాయి. ప్రస్తుతం 13వ సీజన్ హాట్‌హాట్‌గా కొనసాగుతోంది. కింగ్స్ వర్సెస్ క్వీన్స్ అంటూ అబ్బాయిలు, అమ్మాయిలు తమ స్టెప్పులతో వీక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. ప్రస్తుతం సెమీఫైనల్ పోరు నడుస్తోంది. త్వరలోనే గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. అయితే గ్రాండ్ ఫినాలేకు టాలీవుడ్ అగ్రహీరో గెస్టుగా రాబోతున్నాడు. అతడు ఎవరో కాదు. ఐకాన్ స్టార్ అల్లు […]