జీతాలకే డబ్లుల్లేవు… మళ్లీ మూడు రాజధానులా?: సోము వీర్రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు పరిధి నుంచి తప్పించుకోవడం కోసమే మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుందని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధాని అమరావతిలోనే ఉంటుందని జగన్ చెప్పారని.. ఈ మాట జగన్ అన్నారో లేదో వైసీపీ నేతలంతా ఆత్మపరిశీలన చేసుకోవాలని సోము వీర్రాజు హితవు పలికారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు పెట్టేందుకు అసలు ఏపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు.
Read Also: బిగ్ బ్రేకింగ్…. ఏపీ శాసనమండలి రద్దును వెనక్కి తీసుకున్న సర్కార్
Also Read
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
- OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవని.. ఇంకా మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని సోము వీర్రాజు సూటిగా ప్రశ్నించారు. రాజధాని విషయంలో మళ్లీ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ తికమకకు గురిచేస్తున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. రాయలసీమ నుంచి ఎందరో ముఖ్యమంత్రులుగా పనిచేశారని.. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే ఒక్క హైకోర్టు ఏర్పాటు చేస్తే కర్నూలు రాజధాని అయిపోతుందా అని నిలదీశారు. రాయలసీమపై జగన్‌కు అంత ప్రేమ ఉంటే హంద్రీనీవా, తెలుగు గంగ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. అసలు ఏపీ రాష్ట్రానికి వైసీపీ సర్కారు చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీలో వైసీపీ నేతలు బండ బూతులు మాట్లాడుతూ నేతల వ్యక్తిగత జీవితాలపై మాట్లాడేందుకే సమయం కేటాయిస్తున్నారని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!