టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు రావడం ఒక్కసారిగా కలకలం రేపింది. తనను చంపేస్తామంటూ ఐఎస్ఐఎస్ కాశ్మీర్ నుంచి ఈ మెయిల్స్ రూపంలో బెదిరింపులు వచ్చాయని ఢిల్లీ పోలీసులకు గౌతమ్ గంభీర్ ఫిర్యాదు చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఢిల్లీలోని గౌతమ్ గంభీర్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. Read Also: చర్చనీయాశంగా మారిన రష్మిక ఇంటిపేరు ఎంపీ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ఫిర్యాదుపై తాము దర్యాప్తు చేపట్టామని… […]
వాహనదారులకు ఏపీ ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ అందించింది. బుధవారం సినిమాటోగ్రఫీ బిల్లుతో పాటు వాహన పన్నుల చట్ట సవరణ బిల్లును మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు కొత్త వాహనాల లైఫ్ ట్యాక్స్, పాత వాహనాల గ్రీన్ ట్యాక్స్ పెంచుతూ చట్ట సవరణ చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, అధిక కర్బనాలను విడుదల చేసే వాహనాలను నివారించేందుకు ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టినట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. అందుకే గ్రీన్ ట్యాక్స్ పేరిట పన్నులు […]
మద్రాస్ హైకోర్టు బుధవారం నాడు కీలక తీర్పును వెల్లడించింది. దివంగత సీఎం జయలలిత నివాసం వేద నిలయాన్ని స్మారక మందిరంగా మార్చడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో గత ప్రభుత్వం(అన్నాడీఎంకే సర్కారు) జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. జయలలిత ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని కోర్టు వ్యాఖ్యానించింది. మూడు వారాల్లో వేద నిలయాన్ని జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌కు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. Read Also: […]
చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పోలీసులు షాకిచ్చారు. తిరుపతి సమీపంలో ఉన్న రాయలచెరువు ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళ్లాలనుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. రాయలచెరువును రెడ్‌జోన్‌గా గుర్తించామని… గండి పడటంతో మరమ్మతు పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. Read Also: ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించిన కేంద్ర ప్రభుత్వం రాయలచెరువు వద్ద మరమ్మతుల పనులు జరుగుతుండటంతో చంద్రబాబు కాన్వాయ్ వెళ్లేందుకు ఇబ్బంది ఎదురవుతుందని పోలీసులు వివరణ […]
టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. బుధవారం నాడు క్రికెటర్ భువనేశ్వర్ ఇంట్లో సంతోషం నెలకొంది. ఎందుకంటే అతడు తొలిసారిగా తండ్రయ్యాడు. భువనేశ్వర్ భార్య నుపుర్ నగర్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 2017 నవంబర్ 23న వీరికి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వివాహం జరిగింది. నాలుగో వార్షికోత్సవం ముగిసిన మరుసటి రోజే భువీ భార్యకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం ఉదయం 9 గంటలకు […]
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పేదలకు ఉచితంగా అందిస్తున్న 5 కిలోల ఉచిత రేషన్ పంపిణీని వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. కరోనా లాక్‌డౌన్ అనంతరం పేద ప్రజలకు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా ప్రతి నెల 5 కిలోల బియ్యం, కిలో గోధుమలను ఉచితంగా అందిస్తోంది. కరోనా సెకండ్ […]
దేశంలో పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ఇటీవల పెట్రోల్ ధరలను రూ.5 మేర కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇప్పుడు గ్యాస్ ధరలను కూడా తగ్గించాలని మోదీ సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వంట గ్యాస్ సిలిండర్ ధర ఇటీవల కాలంలో రూ.వెయ్యికి చేరింది. దీంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. పలు రాష్ట్రాలలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.312 రాయితీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. Read Also: మగువలకు శుభవార్త… […]
పండగలతో నిమిత్తం లేకుండా మనదేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో బంగారం కొనాలని భావిస్తున్న వారికి గుడ్‌న్యూస్. దేశంలో మంగళవారం రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో విలువైన లోహాల ధరలు పతనం కావడంతో దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం రాత్రికి రాత్రే 10 గ్రాముల బంగారం ధర రూ.810 తగ్గి రూ.46,896కు చేరింది. కేవలం వారం రోజుల్లోనే పసిడి ధర రూ.2 వేల వరకు తగ్గింది. Read Also: […]
ఏపీలో భారీ వర్షాల కారణంగా రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితుల సహాయార్థం జోలె పట్టి విరాళాలను సేకరించాలని పార్టీ శ్రేణులకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు పిలుపునిచ్చారు. వరద ప్రభావిత జిల్లాలలో బాధితులను ఆదుకునేందుకు ఈనెల 25, 26 తేదీల్లో విరాళాల సేకరణకు కార్యాచరణ రూపొందించినట్లు సోము వీర్రాజు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా విరాళాలను సేకరిస్తామని, ప్రజలు నగదు, వస్తు రూపంలో విరాళాలను అందజేయవచ్చని […]
యువరత్న నందమూరి బాలకృష్ణ యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన మూవీ ‘అఖండ’. డిసెంబర్ 2న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీంతో ఈనెల 27న శనివారం సాయంత్రం అఖండ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించాలని ప్లాన్ చేసింది. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ నిర్వహించనున్నట్లు […]