టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కవిత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం నాడు ఆమె ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు నామినేషన్ దాఖలుకు ఆఖరి రోజు కావడంతో మంగళవారం మధ్యాహ్నం 1:45 గంటలకు ముహూర్తం చూసుకుని కవిత తన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి సమర్పించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌లతో కలిసి కవిత నామినేషన్ దాఖలు చేశారు.
Read Also: జీహెచ్ఎంసీ వద్ద ఉద్రిక్తత.. రణరంగంగా మారిన మేయర్ ఛాంబర్
ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాను నామినేషన్ వేసినట్లు కవిత వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో 90 శాతం మంది ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారని.. వారందరూ తన నామినేషన్‌ను జయప్రదం చేయాలని కోరారు. మంత్రి, ఆర్టీసీ ఛైర్మన్, ప్రభుత్వ విప్, స్పీకర్.. ఇలా మహుమహులందరూ తమ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండటం శుభపరిణామం అని కవిత పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు మరోసారి దక్కుతుందని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.