Hyper Aadi: జబర్దస్త్ షోతో అదరిపోయే రీతిలో క్రేజ్ సంపాదించుకున్న హైపర్ ఆదికి తీవ్ర అవమానం జరిగింది. లాక్కెళ్లి మరీ అతడికి గుండు కొట్టించారు. దీంతో హైపర్ ఆది బిక్కముఖం వేశాడు. దీంతో అతడి అభిమానులు హైపర్ ఆదికి ఏం జరిగిందని ఆరాలు తీస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జబర్దస్త్ షోతో పాటు హైపర్ ఆది మల్లెమాల సంస్థ వాళ్లు నిర్వహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోనూ నటిస్తున్నాడు. ఇటీవల ఈ షోకు కూడా పాపులారిటీ పెరిగిపోయింది. దాదాపు జబర్దస్త్ యాంకర్లు, న్యాయనిర్ణేతలు, కమెడియన్‌లు ఈ షోలో పాల్గొంటున్నారు. ఈ షోకు స్పెషల్ అట్రాక్షన్ ఎవరంటే హైపర్ ఆది అనే అభిమానులు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఆది వేసే పంచ్‌లు ప్రేక్షకులకు నవ్వులు పువ్వులు పూయిస్తున్నాయి.
Read Also: Thiruveer: ‘మసూద’ హీరో పేరు వెనుక కథ ఇదే!
తాజా శ్రీదేవి డ్రామా కంపెనీ షో నిర్వాహకులు ఓ ప్రోమో విడుదల చేశారు. అందులో హైపర్ ఆదిని లాక్కెళ్లి మరీ గుండు కొట్టారు. అయితే ఇదంతా ఓ టాస్కులో భాగంగా చోటుచేసుకుంది. స్క్రీన్‌పై కనిపించే నెంబర్స్ నుండి ఒక నంబర్ ఎంచుకోవాలి. ఆ నెంబర్ వెనుక ఉన్న పని తప్పకుండా చేయాల్సి ఉంటుంది. హైపర్ ఆది ఈ గేమ్ ఆడేందుకు వచ్చాడు. తొలుత అతడు 9 అనే నెంబర్ ఎంచుకున్నాడు. దాని వెనుక ఇష్టం వచ్చిన వారిని 30 సెకన్లు ముద్దు పెట్టుకోవచ్చని ఉంది. దీంతో తన స్కిట్లలో నటించే ఐశ్వర్యను పిలిచాడు. అయితే ఐశ్వర్యను ముద్దు పెట్టుకునేందుకు పొట్టి నరేష్ అంగీకరించలేదు. గేమ్‌లో భాగంగా తర్వాత 11 అనే నంబర్‌ను హైపర్ ఆది సెలక్ట్ చేసుకున్నాడు. దాని వెనుక గుండు కొట్టించుకోవాలని ఉండటంతో తోటి కమెడియన్‌లు హైపర్ ఆదిని బలవంతంగా లాక్కెళ్లి గుండు కొట్టించారు. అతనికి కమిట్మెంట్స్ ఉండొచ్చు.. అలా చేయకండని ఇంద్రజ చెబుతున్నా ఎవ్వరూ వినలేదు. బుల్లెట్ భాస్కర్ టాస్క్ అంటే టాస్కే అని వాదించాడు. నిజంగానే ఆది గుండు కొట్టించుకున్నాడో లేదో తెలియాలంటే ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ చూడాల్సిందే.
Chadivimpulu – Sridevi Drama Company Telecast on Sunday at 1:00 PM in #etvtelugu#Chadivimpulu #SrideviDramaCompany #SDC #RashmiGautam #HyperAadi #Indrajahttps://t.co/sfWDrIUKg6
— Mallemalatv (@mallemalatv) November 28, 2022