Rapthadu Heat: టీడీపీ అధినేత చంద్రబాబుపై రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొన్నిరోజులుగా హాట్ టాపిక్‌గా మారాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అప్పట్లో మొద్దు శీనుకు ఒక్కమాట చెప్పుంటే చంద్రబాబును ఆయన ఇంట్లోకి దూరి చంపేసేవాడని తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబు ముసలోడు అని.. రాష్ట్రానికి ఏం చేయలేడని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. పరుష పదజాలంతో నానా మాటలు అన్నారు. దీంతో చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.
Read Also: Ragging: విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చిన ర్యాగింగ్ భూతం.. రెండో అంతస్తు నుంచి..
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వైసీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖరరెడ్డి క్షమాపణలు చెప్పారు. ఎస్పీని కలిసేందుకు సోమవారం నాడు తన అనుచరులతో కలిసి ర్యాలీగా అనంతపురం వచ్చిన చంద్రశేఖరెడ్డి ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమాపణ కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఐ టీడీపీ వారికి ఇక్కడ ఉన్న కొంత మంది జీతాలు ఇచ్చి తమపై కామెంట్స్ పెట్టిస్తున్నారని.. తన కుటుంబ సభ్యులను తిట్టిస్తున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరామని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. దీని వెనుక చంద్రబాబు, లోకేష్ బాబుతో పాటు పరిటాల కుటుంబం ఉందనేది తమ అభిప్రాయమన్నారు.