భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ చేయనున్నారని వస్తున్న వార్తలపై కేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. భారత ఐకానిక్ అయిన రైల్వేలను ప్రైవేటీకరణ చేయనున్నామని లేదా విక్రయిస్తున్నామని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. భవిష్యత్‌లోనూ అలాంటి నిర్ణయం ఉండదని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైల్వే అనేది క్లిష్టమైన వ్యవస్థ అని… రైల్వేలను ప్రైవేటీకరించే విషయంపై కేంద్రం ఎలాంటి చర్చలు జరపడంలేదని ఆయన పేర్కొన్నారు. కాగా గతంలోనూ రైల్వేల […]
టాలీవుడ్‌లో హీరో నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. ఈ విజయాల్లో ముఖ్యంగా ఇద్దరు డైరెక్టర్లకు సింహ భాగం ఉంది. గతంలో బాలయ్య-బి.గోపాల్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ షేక్ అయ్యేది. వీరిద్దరి కాంబోలో చాలా హిట్లు ఉన్నాయి. లారీడ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే భారీ అంచనాలతో వచ్చిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా విఫలం కావడంతో ఆ […]
ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. గత మూడు రోజులుగా ముంబైలో కురుస్తున్న వర్షాలకు పిచ్, అవుట్ ఫీల్డ్ తడిగా మారాయి. ఈ క్రమంలో అంపైర్లు మైదానాన్ని పరిశీలించారు. ఆటకు అనువుగా లేకపోవడంతో టాస్‌ను కాసేపు వాయిదా వేశారు. గ్రౌండ్ సిబ్బంది, అంపైర్లు ఉ.9:30గంటలకు మరోసారి మైదానాన్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాతే టాస్ వేసి మ్యాచ్‌ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రెండో టెస్ట్ సుమారు 30 నిమిషాల […]
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలుడిపై యువతి లైంగిక దాడి చేయడమే కాకుండా అతడిని బెదిరించి రూ.16 లక్షల సొత్తును కాజేసింది. వివరాల్లోకి వెళ్తే… టోలిచౌకీలో నివాసం ఉంటున్న కుటుంబం ఇటీవల జూబ్లీహిల్స్‌కు మారింది. అయితే ఇల్లు సద్దుతున్న క్రమంలో 20 తులాల బంగారం కనిపించలేదు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో తల్లి 9వ తరగతి చదువుతున్న కుమారుడిని ప్రశ్నించగా.. విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఆ బంగారం తీసింది తానేనని బాలుడు చెప్పడంతో తల్లి […]
2022 ఏడాది రాకముందే సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కొత్త ఏడాదిలో సిమెంట్ ధర మరింత పెరగనుంది. ప్రస్తుతం రూ.385 వరకు పలుకుతున్న 50 కిలోల సిమెంట్ బస్తా ధర మరో రూ.20 పెరగనుందని క్రిసిల్ అంచనా వేసింది. ఇదే జరిగితే గతంలో ఎన్నడూ లేని విధంగా బస్తా సిమెంట్ ధర రూ.400 దాటనుంది. సిమెంట్ తయారీ ధరలో ప్రధాన ముడి పదార్థాలైన బొగ్గు, పెట్‌కోక్‌ల ధరలు ఇటీవల విపరీతంగా పెరగడంతో త్వరలో సిమెంట్ బస్తాల ధరలు […]
ముంబై వేదికగా నేటి నుంచి భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ జరగనుంది. ఉదయం 9:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో విజయం దాకా వచ్చి డ్రాతో సరిపెట్టుకున్న భారత్.. ఈ టెస్టులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఓడిపోయే టెస్టును అద్భుతంగా పోరాడి డ్రా చేసుకోవడంతో న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. టీమిండియా రెగ్యులర్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ టెస్టులో బరిలోకి దిగనున్నాడు. వ్యక్తిగత కారణాల […]
బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర తుఫానుగా మారనుంది. ప్రస్తుతం వాయుగుండం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 960 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని… ఇది డిసెంబర్ 4న వేకువజామున ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్‌కు అధికారులు జవాద్ అని నామకరణం చేశారు. జవాద్ తుఫాన్ నేపథ్యంలో ఉత్తరాంధ్ర వాసులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. జవాద్ తుఫాన్ ప్రభావంతో […]
✍ నేడు తిరుపతితో పాటు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన… వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, పంటలను పరిశీలించనున్న సీఎం జగన్✍ అమరావతి: నేడు టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం, దర్శి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చ✍ అమరావతి: నేడు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్, హాజరుకావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం, పీఆర్సీ సహా ఉద్యోగుల సమస్యలపై చర్చ✍ నేడు 33వ రోజుకు చేరిన అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్ర… నెల్లూరు […]
నూతన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో రైతులు చేపట్టిన ఉద్యమంపై కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమంలో చనిపోయిన వారికి పరిహారం ఇవ్వాలని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ‘రైతులు చనిపోయారా? మాకు తెలియదే… పరిహారం ఎలా ఇస్తాం?’ అంటూ రైతు ఉద్యమాన్ని అవమానపరిచేలా సమాధానం ఇచ్చారు. రైతులు చేపట్టిన […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ దీపికాకు భారీ స్థాయిలో ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ఆమె ఎలాంటి ఫోటోలు పెట్టినా నెటిజన్లు స్పందిస్తుంటారు. రణ్‌వీర్‌సింగ్‌తో వివాహం అయిన తర్వాత కూడా దీపికా పదుకునేను లక్షలాది మంది అభిమానులు ఇష్టపడుతున్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దీపికా పదుకునే డ్రెస్సింగ్ స్టైలును చాలా మంది అభిమానులు ఇష్టపడుతుంటారు. ఆమె వేసుకునే ఫ్యాషన్ డ్రస్సులకు కుర్రకారు ఫిదా […]