బ్యాంకులకు రుణాలు కట్టకుండా విదేశాలకు పారిపోయి తలదాచుకున్న కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను వెనక్కి తెచ్చేందుకు భారత ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ సఫలం కాలేకపోయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి తాము విజయ్ మాల్యా కోసం వేచిచూడలేమని స్పష్టం చేసింది. విజయ్ మాల్యా వచ్చినా.. రాకున్నా.. జనవరి 18న శిక్షను విధిస్తామని తేల్చి చెప్పింది. Read Also: కొత్త బిజినెస్ ప్రారంభించిన ‘ఓలా’ విజయ్ […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. నాలుగు రోజుల్లో ముగ్గురు ప్రముఖులు మృతి చెందడంతో టాలీవుడ్‌కు ఏమైందంటూ పలువురు చర్చించుకుంటున్నారు. నవంబర్ 27న ప్రముఖ డైరెక్టర్ కేఎస్ నాగేశ్వరరావు గుండెపోటుతో కన్నుమూశారు. ఒక్కరోజు గ్యాప్‌లో అంటే నవంబర్ 28న ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ కరోనా వల్ల ఊపిరితిత్తులు ఫెయిల్ కావడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషాదం నుంచి తేరుకోకముందే మరో రెండు రోజుల గ్యాప్‌లో నవంబర్ 30న దిగ్గజ […]
ఈనెల 3 నుంచి ముంబై వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు జరగనుంది. ఉత్కంఠ రేపిన తొలి టెస్టు చివరకు డ్రాగా ముగియడంతో రెండో టెస్టులో విజయం సాధించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఈ టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పునరాగమనం చేస్తుండటంతో అతడు ఎవరి స్థానాన్ని భర్తీ చేస్తాడన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే టెస్టు జట్టులోకి కొత్తగా వచ్చిన శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా ఆడటంతో అతడిపై వేటు వేసే అవకాశం లేదు. దీంతో సీనియర్ […]
విజయవాడ నగరంలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తోందన్న వార్తలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. టూటౌన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే చెడ్డీ గ్యాంగ్ ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడుతుందన్న విషయంపై పోలీసులకు స్పష్టత అందాల్సి ఉంది. చెడ్డీ గ్యాంగ్ సంచారంపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారి వల్ల ఎవరికైనా నష్టం కలిగితే ప్రజలు వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. Read Also: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు […]
అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో కాల్పులు కలకలం సృష్టించాయి. డెట్రాయిట్ నగరానికి సమీపంలోని ఓ పాఠశాలలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో పాఠశాలలోని ముగ్గురు విద్యార్థులు మరణించారు. ఈ ఘటనలో ఓ టీచర్ సహా మరో ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. Read Also: ఇండో-పాక్ సరిహద్దుకు అమిత్‌షా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు పాఠశాలను చుట్టుముట్టారు. అనంతరం 15 ఏళ్ల అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ఓ తుపాకీని, 15-20 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం […]
1) నేడు మూడోరోజు పార్లమెంట్ సమావేశాలు.. ఒమిక్రాన్ వేరియంట్‌పై కేంద్రం ప్రకటన చేసే అవకాశం2) హైదరాబాద్: నేడు ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల అంత్యక్రియలు.. హాజరుకానున్న ఏపీ మంత్రి పేర్ని నాని, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు3) కృష్ణా: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై దాఖలైన పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ4) నెల్లూరు: 31వ రోజుకు చేరిన రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్ర… నేడు మరపూరు నుంచి ప్రారంభం.. నేడు 12 కి.మీ. మేర సాగనున్న […]
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసులో భారత్‌ను పాకిస్థాన్ అధిగమించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో పాకిస్థాన్ ఖాతాలో 12 పాయింట్లు చేరడంతో ఆ జట్టు మొత్తం పాయింట్ల సంఖ్య 24కి చేరింది. బంగ్లాదేశ్‌పై టెస్టు గెలిచిన తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ రెండో స్థానానికి చేరుకుంది. అయితే పాకిస్థాన్ కంటే భారత్‌కు ఎక్కువ పాయింట్లు ఉన్నా విన్నింగ్ పర్సంటేజీలో మాత్రం వెనుకబడి […]
గుండెపోటుతో మృతిచెందిన తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నివాళులు అర్పించారు. అనంతరం శేషాద్రి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన శేషాద్రి ఇక లేరన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని తెలిపారు. శేషాద్రి స్వామితో తనకు 25 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. శేషాద్రి మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని ఎన్వీ రమణ […]
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులకు సంబంధించిన స్టేటస్‌ను మంగళవారం నాడు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. టీఆర్ఎస్ ఎంపీ సురేష్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర విమానాయానశాఖ మంత్రి వీకే సింగ్ సమాధానం ఇచ్చారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్‌లో, మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. Read Also: […]
నిబంధనలను ఉల్లంఘించినందుకు యూనియన్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ జరిమానా విధించింది. ఇటీవల యూనియన్ బ్యాంక్‌కు సంబంధించి 2019 స్టాట్యూటరీ ఇన్‌ఫెక్షన్ ఫర్ సూపర్‌వైజరీ ఎవాల్యూయేషన్‌ను ఆర్‌బీఐ నిర్వహించింది. ఆర్‌బీఐ నిబంధనల్లో భాగంగా ఏ బ్యాంకు అయినా కస్టమర్లతో కుదుర్చుకున్న ఒప్పందాలను లేదా లావాదేవీలకు సంబంధించిన అంశాలను బహిర్గతం చేయడానికి వీల్లేదు. Read Also: కేవలం 35 పైసలుతో రూ.10 లక్షల ఇన్సూరెన్స్ పొందండి అయితే యూనియన్ బ్యాంక్ ఈ నిబంధనలను ఉల్లంఘించడంతో రూ.కోటి […]