భారతీయ రైల్వే ప్రైవేటీకరణపై కేంద్రప్రభుత్వం క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ చేయనున్నారని వస్తున్న వార్తలపై కేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. భారత ఐకానిక్ అయిన రైల్వేలను ప్రైవేటీకరణ చేయనున్నామని లేదా విక్రయిస్తున్నామని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. భవిష్యత్‌లోనూ అలాంటి నిర్ణయం ఉండదని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైల్వే అనేది క్లిష్టమైన వ్యవస్థ అని… రైల్వేలను ప్రైవేటీకరించే విషయంపై కేంద్రం ఎలాంటి చర్చలు జరపడంలేదని ఆయన పేర్కొన్నారు.
కాగా గతంలోనూ రైల్వేల ప్రైవేటీకరణ విషయంపై అప్పటి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పష్టత ఇచ్చారు. తాము ఎప్పటికీ రైల్వేలను ప్రైవేట్ పరం చేయబోమని చెప్పినా.. ఈ విషయంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. మరోవైపు రైతుల ఆందోళన, ఇతర సంస్థ ఆందోళనల కారణంగా ఈ ఏడాది రైల్వేలకు రూ.36.87 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. నార్తన్ రైల్వేకు అత్యధికంగా రూ.22.58 కోట్ల నష్టం వచ్చిందన్నారు. రైల్వేల భద్రత పూర్తిగా రైల్వే పోలీసులు లేదా జిల్లా పోలీసుల చేతుల్లో ఉందని.. ప్రయాణికుల రక్షణ విషయంలో రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్) చూసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!