సొంతిల్లు కట్టుకోవాలనుకునే వారికి సిమెంట్ కంపెనీలు ఊరట కలిగించే వార్తను అందించాయి. 50 కిలోల బస్తాపై రూ.20 నుంచి రూ.40 వరకు తగ్గిస్తున్నట్లు సిమెంట్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో ఏపీ, తెలంగాణలో 50 కిలోల సిమెంట్ బస్తా ధర రూ.40 తగ్గింది. తమిళనాడులో రూ.20 తగ్గగా… కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో బస్తా ధర రూ.30 వరకు తగ్గినట్లు తెలుస్తోంది. తాజా ధరల ప్రకారం తెలుగు రాష్ట్రాలలో సిమెంట్ బస్తా బ్రాండ్‌ను బట్టి రూ.280 నుంచి రూ.320కి లభించనుంది. […]
హైదరాబాద్ నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల పెద్దమొత్తంలో పలువురి మొబైళ్లు అపహరణకు గురయ్యాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని బాధితులు తమ మొబైల్ ఫోన్లు మిస్సయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ఫిర్యాదులను హాక్ ఐ యాప్‌ను ఉపయోగించి బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ల ఆచూకీని కనిపెడుతున్నారు. ఈ టెక్నాలజీతో మొబైల్ కేటుగాళ్లకు పోలీసులు చెక్ చెప్తున్నారు. Read Also: గుడ్‌న్యూస్.. త్వరలో భారత్ నుంచి మరో […]
భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లంటే ఎంత ఆసక్తి ఉంటుందో… ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈనెల 8 నుంచి యాషెస్ సిరీస్ ప్రారంభం అవుతోంది. ఈ సిరీస్ ఆస్ట్రేలియా గడ్డపై జరగనుంది. తొలి టెస్టు బ్రిస్బేన్ వేదికగా భారత కాలమానం ప్రకారం ఉ.5:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టు ప్రారంభానికి ముందే ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ దగ్గుతో […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈనెల 9న ఉదయం 10 గంటలకు ఈ మూవీ ట్రైలర్ తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన థియేటర్లలో విడుదల కాబోతోంది. థియేటర్లలో విడుదలైన అనంతరం యూట్యూబ్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ట్రైలర్ చూస్తే రామ్‌చరణ్, ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు రావడం ఖాయమని ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. ఈ ట్రైలర్ నిడివి రెండున్నర నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది. హైదరాబాద్ […]
భద్రాచలంలోని రామయ్యను సోమవారం సాయంత్రం ఏపీ మంత్రి కొడాలి నాని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రి కొడాలి నాని కుటుంబంతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం మంత్రి కొడాలి నాని శ్రీరాముడికి రూ.13 లక్షలు విలువ చేసే బంగారు కిరీటాన్ని కానుకగా ఇచ్చారు. ఈ మేరకు కిరీటాన్ని ఆలయ అర్చకులకు అందించారు. Read Also: సైబర్ నేరగాళ్ల వలలో డిప్యూటీ తహసీల్దార్ ప్రత్యేక పూజల అనంతరం మంత్రి కొడాలి నాని మీడియాతో […]
యంగ్ యూట్యూబర్ శ్రియా మురళీధర్ గుండెపోటుతో సోమవారం రాత్రి మరణించింది. ఆమె 27 ఏళ్ల వయసులోనే కార్డియాక్ అరెస్ట్‌కు గురికావడం అందరినీ కలిచివేస్తోంది. యాంకర్ ప్రదీప్ మాచిరాజు ‘పెళ్లి చూపులు’ రియాలిటీ షోలో శ్రియ మురళీధర్ కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆ తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. ‘బ్యూటీ అండ్ ద బాస్’ సీజన్ 2లోనూ శ్రియా మురళీధర్ ఓ పాత్రలో నటించింది. అనంతరం యూట్యూబ్‌లో పలు షార్ట్ ఫిలింలో నటించి మంచి పేరు సంపాదించింది. Read […]
కోర్టు ధిక్కరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లా డీఈవో కె.శామ్యూల్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని ఏదైనా వృద్ధాశ్రమంలో గానీ, అనాథాశ్రమంలో గానీ వారం రోజులు భోజన ఖర్చులు భరించాలని ఆదేశించింది. తమ ఆదేశాలను అమలు చేయకపోవడం కక్షిదారులకు న్యాయం దొరకకుండా చేయడమే కాకుండా, కోర్టును అవమానించడమేనని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. Read Also: ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే విల్లాల్లోకి చొరబడ్డ చెడ్డీ గ్యాంగ్ అనంతపురం జిల్లాకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ పి.వెంకటరమణకు […]
కొత్త సంవత్సరం నుంచి బ్యాంక్ ఖాతాదారులకు షాక్ తగలనుంది. 2022, జనవరి 1 నుంచి ఏటీఎం సెంటర్లలో అపరిమిత లావాదేవీలు జరిపితే ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు అపరిమిత లావాదేవీలపై రుసుములు పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రతి నెలా ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితి దాటితే.. ఎక్కువ రుసుములు వసూలు చేస్తామని తెలిపింది. ఈ మేరకు కస్టమర్ల నుంచి ఫైన్ వసూలు చేసేందుకు దేశంలోని అనేక బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి […]
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఈ సినిమాను నైజాంతో పాటు ఏపీలోని వైజాగ్ ఏరియాకు నిర్మాత దిల్ రాజు తన వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా పంపిణీ చేశాడు. డిస్ట్రిబ్యూటర్‌గా ఈ సినిమా ద్వారా లాభాలను చవిచూడటంతో దిల్ రాజు అఖండ టీమ్‌కు పార్టీ ఇచ్చాడు. సోమవారం రాత్రి జరిగిన ఈ పార్టీకి బాలయ్య, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ సహా పలువురు దిల్ రాజు […]
ఏపీలో చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోతోంది. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం సమీపంలోనే చెడ్డీ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతోంది. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సంబంధించిన విల్లాల్లోకి చొరబడిన చెడ్డీ గ్యాంగ్… విలువైన వస్తువులు అపహరించేందుకు ప్రయత్నించింది. ఈ గ్యాంగులో ఉన్న ఐదుగురు సభ్యులు చెడ్డీలు, తలపాగాలు ధరించి ఉన్నారు. చేతిలో మారణాయుధాలు కూడా ఉన్నాయి. ఈనెల 3న అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా… మూడు రోజుల పాటు పోలీసులు ఈ విషయాన్ని […]