కడపలో సందడి చేసిన హీరోయిన్ సమంత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరోయిన్‌లలో సమంత గత కొన్నిరోజులుగా నిత్యం వార్తల్లో ఉంటోంది. ఒకవైపు నాగచైతన్యతో విడాకుల గొడవ.. మరోవైపు పుష్పలో ఐటం సాంగ్ వంటి విషయాలతో సమంత వార్తల్లో నిలుస్తోంది. దీంతో సమంత క్రేజ్‌ను పలు వ్యాపార సంస్థలు కూడా క్యాష్ చేసుకుంటున్నాయి. తాజాగా కడప పట్టణంలో ఆదివారం నాడు హీరోయిన్ సమంత సందడి చేసింది. కడప ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సమంత ముఖ్య అతిథిగా హాజరైంది.
Read Also: అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్
Also Read
సమంత తమ ఊరికి వస్తుందన్న విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు.. సమంతను చూసేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో కడప బస్టాండ్ సెంటర్ అభిమానులతో హోరెత్తిపోయింది. సమంతతో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు పలువురు యువకులు పోటీలు పడ్డారు. అయితే బౌన్సర్లు, సమంత భద్రతా సిబ్బంది వారిని దూరంగా నెట్టివేశారు. సమంత రాక నేపథ్యంలో కడప బస్టాండ్ సెంటర్‌లో ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో సాధారణ ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. కాగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అనంతరం సమంత అభివాదం చేయగా అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కాగా కడపలో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.
The queen is here #samantharuthprabhu in #Kadapa for store launch
#samantha @Samanthaprabhu2 #maangalya pic.twitter.com/NNkWav3buc
— Samantha Ruth Prabhu (@Samanthaa1050) December 12, 2021
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!