ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్‌ఎల్ వినియోగదారులను ఆకట్టుకునేలా అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. రూ.599 ప్లాన్‌తో ప్రతిరోజూ 5జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ పొందవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. అంతేకాకుండా రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా చేసుకోవచ్చని సూచించింది. డైలీ డేటా లిమిట్ ముగిసిన అనంతరం 40 KBPS డేటా వాడుకోవచ్చని పేర్కొంది. అటు అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్ లిమిటెడ్ ఫ్రీ డేటాను వాడుకోవచ్చని… ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుందని బీఎస్ఎన్ఎల్ వివరించింది.
Read Also: ఎకానమీ: 2033 నాటికి ఇండియా మూడో స్థానంలో నిలుస్తుందా?
మరోవైపు ఈ సదుపాయాలతో పాటు జింగ్‌మ్యూజిక్‌ను ఉచితంగా ఆనందించవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఇతర నెట్‌వర్కులతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన ఆఫర్ చాలా తక్కువ ధరకు వస్తుందని.. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఉద్యోగులకు ఈ ఆఫర్ చాలా ఉపయోగపడుతుందని బిజినెస్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.