★ నేడు ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎం జగన్ చర్చలు… తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం★ చిత్తూరు జిల్లాలో నేటి నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన.. కుప్పం మండలం దేవరాజపురం నుంచి పర్యటించనున్న చంద్రబాబు.. నేడు రామకుప్పం మండలంలో చంద్రబాబు రోడ్ షో★ అమరావతి రాజధాని నగరపాలక సంస్థ ఏర్పాటుపై నేడు రెండో రోజు గ్రామసభలు… నేడు కృష్ణాయపాలెం, వెంకటపాలెం, లింగాయపాలెం, ఉద్ధండరాయునిపాలెంలో గ్రామసభలు★ పశ్చిమగోదావరి జిల్లాలో నేటి నుంచి […]
ఏపీలో క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో బుధవారం మధ్యాహ్నం మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అమెరికా నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరితో పాటు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి నుంచి మరో మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది. Read Also: పావురం కాలికి చైనా ట్యాగ్… […]
ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల సంఖ్య మరింత పెరుగుతోంది. తాజాగా మరో రూ.2,500 కోట్ల రుణాన్ని ఏపీ ప్రభుత్వం సమీకరించింది. రిజర్వుబ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ప్రభుత్వం ఈ రుణాన్ని పొందింది. రాబోయే 20 ఏళ్ల కాలపరిమితితో రుణం తిరిగి చెల్లించేలా 7.22 శాతం వడ్డీతో రూ.వెయ్యి కోట్లు తీసుకుంది. మరో వెయ్యి కోట్లను 18 ఏళ్ల కాలపరిమితికి 7.18 శాతం వడ్డీకి స్వీకరించింది. మరో రూ.500 కోట్లను 16 ఏళ్ల కాలపరిమితితో 7.24 శాతం […]
ప్రపంచమంతా కరోనా కల్లోలం కొనసాగుతోంది. చాలా దేశాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్ కూడా కరోనా బారిన పడ్డాడు. దీంతో అధికారులు అతడిని ఐసోలేషన్‌కు తరలించారు. ప్రస్తుతం మ్యాక్స్‌వెల్ బిగ్‌బాష్ టోర్నీలో మెల్‌బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటికే మెల్‌బోర్న్ జట్టులో 12 మంది కరోనా బారిన పడగా ఇప్పుడు మ్యాక్స్‌వెల్ 13వ వాడు కావడం గమనార్హం. ఆ జట్టులో 8 మంది సహాయక సిబ్బంది, నలుగురు ఆటగాళ్లకు […]
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓటర్ల జాబితా-2022ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా దాఖలైన అప్లికేషన్‌లను పరిష్కరించిన కేంద్ర ఎన్నికల సంఘం అనంతరం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. ఈమేరకు తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,03,56,894 మంది ఉన్నారని తెలియజేసింది. ఇందులో పురుష ఓటర్లు 1,52,56,474, మహిళా ఓటర్లు 1,50,98,685, ఇతర ఓటర్లు 1,735 మంది ఉన్నారు. ఓటర్ల జాబితాలో 18-19 ఏళ్ల మధ్య ఓటర్ల సంఖ్య 1,36,496గా ఉన్నట్లు కేంద్ర […]
కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం రూ.50వేలు పరిహారం ఇస్తోంది. గత ఏడాది నవంబరులో తొలి విడతలో 3,870 దరఖాస్తులు రాగా డిసెంబరులో వాటిని ఆమోదించి ప్రభుత్వం పరిహారాన్ని అందజేసింది. ఇంకా బాధిత కుటుంబాలు ఉంటే పరిహారం అందుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. బాధిత కుటుంబాలు పరిహారం కోసం మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని విప్తతు నిర్వహణ శాఖ సూచించింది. Read […]
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై తాజాగా మరో కేసు నమోదైంది. శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన సామాజిక కార్యకర్త బంగారు సాయి ఫిర్యాదుతో నిజామాబాద్ ఐదో టౌన్ పోలీసులు అరవింద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గతేడాది అక్టోబర్ 31న హైదరాబాద్‌లో అట్రాసిటీ చట్టాన్ని కించపరిచేలా అరవింద్ వ్యాఖ్యానించారని.. దళిత సమాజాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆయన్ను చట్టప్రకారం శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. Read Also: జస్టిస్ లక్ష్మణ్ రెడ్డిపై ఆర్జీవీ సెటైర్లు మరోవైపు మంగళవారం నాడు […]
ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు చదివే విద్యార్థులకు విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే జగనన్న విద్యాదీవెన కిట్లు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వేసవి సెలవుల్లోనే విద్యాదీవెన కిట్లను స్కూళ్లకు చేర్చాలని అధికారులను మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. అందుకు అవసరమైన టెండర్ల ఖరారు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి సంబంధిత ఏజెన్సీలతో సకాలంలో ఒప్పందాలు పూర్తిచేసుకుని వర్క్ ఆర్డర్లను జారీ చేయాలని సూచించారు. Read Also: […]
ప్రేమకు చిహ్నమైన పావురాళ్లు రహస్య రాయబారం కూడా మోస్తుంటాయి. అయితే ఒడిశాలో పావురాలకు చైనా ట్యాగ్స్ కనిపిస్తుండటం అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. వివరాల్లోకి వెళ్తే… సుందర్‌గఢ్ రాజ్‌గంగ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంస్‌బహాల్ గ్రామంలో గాయంతో ఓ పావురం కిందపడిపోయి గిలగిల కొట్టుకుంటుండగా… ఓ వ్యక్తి ఆ పావురాన్ని కాపాడేందుకు ప్రయత్నించాడు. Read Also: కరోనా థర్డ్ వేవ్.. వారంలో 400 శాతం పెరిగిన కరోనా కేసులు ఈ క్రమంలో పావురం కాలికి పచ్చకట్టు ఉండటం సదరు వ్యక్తి […]
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కేసులు పెరుగుతున్న ట్రెండ్ చూస్తుంటే థర్డ్‌వేవ్ వచ్చినట్లు క్లియర్‌గా కనిపిస్తోంది. వారం రోజుల తేడాలో దాదాపు 44 వేల కరోనా కేసులు పెరిగాయి. వారం క్రితం 13వేలు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు ప్రస్తుతం 58వేల మార్కుకు చేరుకున్నాయి. Read Also: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు… మరణాలు గత వారం రోజులుగా నమోదైన కేసుల […]