నెల్లూరుకు చెందిన అకరపాక సురేష్ అనే దివ్యాంగుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనను చెడు వ్యసనాల నుంచి కాపాడింది, సమాజంలో వెక్కిరింపుల నుంచి గౌరవప్రదంగా నిలబెట్టింది అయ్యప్పస్వామి అని దివ్యాంగుడు బలంగా నమ్మాడు. దీంతో ఏకంగా 750 కిలోమీటర్లు పాదయాత్ర చేసి శబరిమలలోని అయ్యప్పను దర్శించుకున్నాడు. గత ఏడాది సెప్టెంబర్ 20న నెల్లూరు పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న అమ్మ వారి ఆలయంలో ఇరుముడి కట్టుకుని పాదయాత్రగా బయలుదేరిన సురేష్.. కరోనా కాలంలోనూ ఎన్నో వ్యయ […]
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. కేంద్రం కొత్తగా సవరించిన నిబంధనలకు అనుగుణంగా టీటీడీ ఎఫ్‌సీఆర్‌ఏ (ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) లైసెన్సుకు రెన్యువల్ దరఖాస్తు చేసుకోలేకపోయింది. దీంతో టీటీడీ దరఖాస్తును కేంద్రం తిరస్కరించింది. ఈ కారణంగా టీటీడీకి వచ్చే విరాళాలు భారీ మొత్తంలో ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో 2020-21 ఏడాదిలో టీటీడీకి విదేశీ విరాళాల రూపంలో ఒక్క రూపాయి కూడా అందలేదు. Read Also: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా […]
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించింది. విదేశాల్లో తొలిసారిగా టెస్టుల్లో బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. Read Also: సామాన్యుడిపై మరో భారం… పెరిగిన సిమెంట్ ధరలు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 328 పరుగులు చేయగా.. కివీస్ బౌలర్లను […]
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. బీహార్‌లోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బీహార్‌లోని నలంద మెడికల్ కాలేజీలో సోమవారం 72 మంది డాక్టర్లు కరోనా బారిన పడగా… తాజాగా మరో 59 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 143 మంది డాక్టర్లు కరోనాతో బాధపడుతున్నారని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గత మూడు, నాలుగు రోజులుగా ఆయా డాక్టర్లను కలిసిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. […]
ఇప్పటికే నిత్యావసరల ధరలు, కూరగాయల ధరలు, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరల పెంపుతో అల్లాడిపోతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది. ఏపీ, తెలంగాణలో సిమెంట్ బస్తాల ధరలు పెరిగాయి. 50 కిలోల బస్తాపై ధరను రూ.20-30 మేర పెంచుతున్నట్లు డీలర్లు పేర్కొన్నారు. డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో ధర పెంచినట్లు చెప్పారు. ధరల పెంపుతో సిమెంట్ బస్తా ధర రూ.300-350 మధ్యలో ఉంటుందని తెలిపారు. Read Also: కరోనాకు టాబ్లెట్ వచ్చేసింది… ధర ఎంతో తెలుసా? గత […]
దేశంలో మళ్లీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా సోకుతుండటంపై భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో తొలిసారి కరోనాకు టాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. కరోనా మాత్రలను డా.రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంస్థ మార్కెటింగ్ చేయనుంది. ఈ మేరకు అమెరికన్ ఫార్మా కంపెనీ మెర్క్ అభివృద్ధి చేసిన ‘మోల్నుపిరవిర్’ మాత్రల ధరలను డా.రెడ్డీస్ సంస్థ ప్రకటించింది. 200 మిల్లీగ్రాముల మాత్రను రూ.35 చొప్పున విక్రయించనున్నట్లు డా.రెడ్డీస్ తెలిపింది. కరోనా […]
అటు దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ… ఏపీలోనూ ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. మంగళవారం నాడు రాష్ట్రంలో కొత్తగా ఏడుగురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్యశాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. తాజాగా ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వారిలో ఇద్దరు ఒమన్ నుంచి, ఇద్దరు యూఏఈ నుంచి వచ్చారు. అమెరికా నుంచి ఒకరు, దక్షిణ సూడాన్ నుంచి ఒకరు, గోవా నుంచి ఒకరు ఏపీకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. Read Also: శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు.. […]
శ్రీకాకుళం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. మంగళవారం రాత్రి జిల్లాలోని ఇచ్చాపురంలో నిమిషాల వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు కవిటి, కంచిలి మండలాల్లోనూ భూమి కంపించింది. గత వారం రోజులలో రెండోసారి భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. Read Also: ఒక ఇంటికి ఒకటే మీటర్.. ఈ మ్యాటర్ వర్కవుట్ అవుతుందా? ఇచ్చాపురం, కంచిలి, కవిటి మండలాల్లోని […]
★ నేటి నుంచి ఈనెల 9 వరకు తిరుపతిలోని ఇందిరా మైదానంలో జాతీయ కబడ్డీ పోటీలు★ మంగళగిరిలో నేడు రెండో రోజు పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమావేశం.. అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఇంఛార్జులతో భేటీ కానున్న చంద్రబాబు★ 750వ రోజుకు చేరిన అమరావతి రైతుల పోరాటం… రాజధాని గ్రామాల్లో అమరావతి జేఏసీ ప్రత్యేక కార్యక్రమాలు.. ఆగిన అమరావతి నిర్మాణం-అభివృద్ధిలో వెనుకబడిన ఆంధ్ర పేరుతో సదస్సులు.. వెలగపూడి, తుళ్లూరు, మందడంలో ప్రజాచైతన్య సదస్సులు★ తెలంగాణ హైకోర్టులో నేటి నుంచి […]
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడు నరసింహం చిక్కుల్లో పడ్డారు. ఆయనపై పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ కేసు నమోదైంది. రాజమండ్రికి చెందిన గద్దె జయరామకృష్ణ, శ్రీవాణి దంపతుల ఆస్తులను ఫోర్జరీ సంతకాలతో బ్యాంకులో తాకట్టు పెట్టి నరసింహం లోన్ తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. 2018-19లో కొందరు బ్యాంకు సిబ్బంది సహకారంతో నరసింహం ఈ ఫ్రాడ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. Read Also: రూపాయి పంపి రూ.99వేలు పోగొట్టుకున్నాడు కాగా సోము […]