Ramesh Nalam
Author- NTV Telugu-
విషాదం… టీకా వికటించి ముగ్గురు చిన్నారులు మృతి
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామదుర్గ తాలూకా సాలహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా వికటించడంతో ఆదివారం నాడు ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. చిన్నారులకు తట్టు వ్యాధి నివారణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రుబెల్లా టీకాలు వేస్తుండటంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ టీకాలను వేయించారు. Read Also: పండగ పూట విషాదం… కల్తీ కల్లు తాగి 11 మంది మృతి అయితే రుబెల్లా టీకాలు వేసిన కాసేపటికే పిల్లల ఆరోగ్యంపై తీవ్ర […] -
పట్నం బాట పట్టిన జనం… విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్
సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రజలు పల్లెల నుంచి పట్నం బాట పట్టారు. దీంతో స్వగ్రామాల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు పయనం అయ్యారు. సోమవారం నుంచి ఆఫీసులు తెరుచుకోవడంతో ఉద్యోగులు సొంతూళ్ల నుంచి హైదరాబాద్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. Read Also: పశువుల పండగలో విషాదం.. పొట్టేలుకు బదులు మనిషి బలి సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాల రాకపోకలు సోమవారం రెట్టింపు స్థాయిలో ఉన్నాయని […] -
జనవరి 17, సోమవారం దినఫలాలు
మేషం: దైవ సేవా కార్యక్రమాలలో ఇబ్బందులు తప్పవు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అసవరం. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా మెలగాలి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. మిత్రులను కలుసుకుంటారు. వృషభం: బంధువుల రాకతో గృహంలో సందడి కానొస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు […] -
కాంగ్రెస్ బాటలో బీజేపీ.. పంజాబ్ ఎన్నికలు వాయిదా వేయాలి
పంజాబ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. వచ్చే నెల 14న జరగాల్సిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను కనీసం ఆరు రోజులపాటు వాయిదా వేయాలని ఆ రాష్ట్ర సీఎం చరణ్‌జీత్ సింగ్ ఎన్నికల కమిషన్‌ను కోరిన కొన్ని గంటలకే బీజేపీ కూడా అటువంటి విజ్ఞప్తే చేసింది. Read Also: కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక పోస్టల్ స్టాంప్ గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకుని […] -
కాంగ్రెస్ పార్టీలో డీఎస్ చేరికకు ముహూర్తం ఫిక్స్
పీసీసీ మాజీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఈనెల 24న ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతల సమక్షంలో డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సుమారు రెండేళ్ల నుంచి టీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలకు డీఎస్ దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆయన ఢిల్లీలో సోనియాగాంధీతో సమావేశం కావడంతో డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖరారైంది. Read Also: 15 ఏళ్ళ నాటి నిర్లక్ష్యం.. కానరాని పరిష్కారం 2015లో బంగారు తెలంగాణ లక్ష్యంగా డీఎస్ […] -
పశువుల పండగలో విషాదం.. పొట్టేలుకు బదులు మనిషి బలి
చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం వలసపల్లెలో విషాదం నెలకొంది. గ్రామంలో సంప్రదాయంగా వస్తున్న పశువుల పండగను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ ఆలయం వద్ద పొట్టేలును బలి ఇచ్చేందుకు స్థానికులు ప్రయత్నించారు. పొట్టేలును అమ్మవారికి బలిచ్చే ముందు అక్కడున్నవారంతా మద్యం సేవించారు. అనంతరం పొట్టేలును బలిచ్చే క్రమంలో 35 ఏళ్ల సురేష్ అనే వ్యక్తి పొట్టేలును గట్టిగా పట్టుకున్నాడు. Read Also: అకాల వర్షం…అన్నదాతకు అపారనష్టం అయితే మద్యం మత్తులో ఉన్న మరో వ్యక్తి పొట్టేలుకు బదులుగా […] -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
★ ఏపీలో సంక్రాంతి సెలవుల అనంతరం నేటి నుంచి యథావిధిగా స్కూళ్లు ప్రారంభం★ నేడు కోవిడ్, వైద్య ఆరోగ్య శాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష… ఏపీలో స్కూళ్లకు సెలవుల పొడిగింపు, ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై చర్చించే అవకాశం★ కర్నూలు: కోవిడ్ కారణంగా నేటి నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనాలు, అన్నప్రసాద వితరణ, పుణ్యస్నానాలు రద్దు★ నేటి నుంచి ఏపీలో మూడు రోజుల పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన.. నేడు ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్‌కు రానున్న వెంకయ్యనాయుడు.. […] -
శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం ఆలయంలో దర్శనానికి ఆంక్షలు విధిస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న వెల్లడించారు. స్వామి, అమ్మవార్ల లఘు దర్శనానికి మాత్రమే భక్తులకు అవకాశం ఉందన్నారు. స్పర్శదర్శనం, అంతరాలయ దర్శనాలు, గర్భాలయ అభిషేకాలు నిలిపివేసినట్లు ఆలయ ఈవో ప్రకటించారు. గతంలో టికెట్లు పొందినవారికి గర్భాలయ అభిషేకాలు పునః ప్రారంభం తరువాత అవకాశం కల్పిస్తామన్నారు. Read Also: గోదారోళ్లతో మాములుగా ఉండదు… అల్లుడికి 365 రకాల వంటకాలతో విందు అటు ఆలయంలో తీర్థం, ఉచిత ప్రసాద […] -
కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక పోస్టల్ స్టాంప్
దేశంలో కరోనా నివారణకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించి జనవరి 16తో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్టాంప్‌ను ఆవిష్కరించింది. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పోస్టల్ స్టాంపు ముద్రించి ఆదివారం నాడు విడుదల చేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వ్యాక్సినేషన్ ప్రారంభమై ఏడాది పూర్తయినందున ఈరోజు ముఖ్యమైన రోజు అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతోందన్నారు. ఇండియాలో కరోనా టీకాల పంపిణీని […] -
న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా తెలుగమ్మాయి
ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు సత్తాచాటుతూనే ఉన్నారు. ఇప్పటికే తెలుగువారు ప్రపంచంలోని పలు దేశాల్లో తమదైన ముద్ర వేసి కీలక పదవులు దక్కించుకుంటున్నారు. తాజాగా ఓ తెలుగమ్మాయి అరుదైన గౌరవం దక్కించుకుంది. న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా తెలుగుమ్మాయి మేఘన ఎంపికైంది. యువతరం ప్రతినిధిగా టీనేజి వయసులోనే ఆమె చట్టసభలోకి ప్రవేశించింది. 18 ఏళ్ల మేఘన వాల్కటో ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. Read Also: వైరల్… ‘పుష్ప’ను వాడేసుకున్న అమూల్ మేఘన తల్లిదండ్రులు న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. ఆమె తండ్రి […]
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?