ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో తెలంగాణ తరహాలో ఏపీలోనూ విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తారని అందరూ భావించారు. కానీ ఈ వార్తలపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే ఆలోచన ఇప్పటికైతే ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. మంత్రి సురేష్ ప్రకటన నేపథ్యంలో సోమవారం నుంచి యథావిధిగా విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. Read Also: ఏపీలోనూ […]
ప్రపంచ అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు జకోవిచ్‌కు ఆస్ట్రేలియా కోర్టు షాకిచ్చింది. తన వీసాను పునరుద్ధించుకోవడానికి జకోవిచ్ ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టును ఆశ్రయించగా… అక్కడ చుక్కెదురైంది. కరోనా వ్యాక్సిన్ తీసుకోకుండా జకోవిచ్ ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టేందుకు ప్రయత్నించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో జకోవిచ్ వీసాను ఆస్ట్రేలియా ప్రభుత్వం రద్దు చేయడం సబబేనని కోర్టు ఏకీభవించింది. జకోవిచ్‌ను ఆస్ట్రేలియా నుంచి తిప్పిపంపాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఫెడరల్ కోర్టు మద్దతు పలికింది. Read Also: అది కోహ్లీ […]
సంక్రాంతి పండగ సందర్భంగా భాగ్యనగరంలోని ప్రజలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నివసించేవారు స్వగ్రామాలకు వెళ్లారు. అయితే సంక్రాంతి పండగ పూర్తి కావడంతో స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరుగుప్రయాణం అవుతున్నారు. అలాంటి వారి కోసం టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సొంత గ్రామాలకు వెళ్లిన వారి కోసం 3,500 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఆఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ […]
తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులను ఈనెల 30 వరకు ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే సెలవుల పొడిగింపు ప్రకటనను ట్రస్మా (తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్-TRSMA) తీవ్రంగా ఖండించింది. అవగాహన లేకుండా విచ్చలవిడిగా కోవిడ్ వాహకాలుగా తిరిగి కోవిడ్ కేసులను పెంచుతున్న వారిని పట్టించుకోకుండా విద్యాసంస్థలను మూసివేయడమేంటని ప్రభుత్వాన్ని ట్రస్మా ప్రశ్నించింది. Read Also: కోవిడ్ ఎఫెక్ట్: రేపటి నుంచి ఆన్ లైన్ క్లాసులు మార్కెట్లు, సినిమా […]
భారత క్రికెట్‌లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ శకం ముగిసింది. గత ఏడాది టీ20లు, వన్డేలకు సంబంధించి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ.. తాజాగా టెస్టులకు కూడా గుడ్ బై చెప్పేశాడు. అయితే ఇది అనూహ్య నిర్ణయం. కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. అయితే కోహ్లీ నిర్ణయంపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. ‘ఇది పూర్తిగా విరాట్ వ్యక్తిగత నిర్ణయం. దాన్ని బీసీసీఐ ఎంతో గౌరవిస్తుంది. విరాట్ సారథ్యంలో అన్ని ఫార్మాట్లలో భారత […]
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని.. జార్ఖండ్‌కు చెందిన వ్యక్తులతో తనను చంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రఘురామ ఆరోపించడంపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. గుడ్డ కాల్చి మొహాన పడేస్తే ఆ మసిని వారే తుడుచుకుంటారులే అనుకుంటున్నాడని రఘురామను ఉద్దేశించి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కూర్చుని తనను చంపేస్తారని ఏడుపు మొదలు పెట్టాడని.. నర్సాపురం ప్రజలకు తన మొహం చూపించలేకే ఇలా పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నాడని […]
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజుకు దాదాపు రెండు లక్షల పైనే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ఈనెల 30 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే ఏపీలోనూ విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే అంశంపై ప్రభుత్వం అధికారులతో విస్తృతంగా చర్చిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్కూళ్లు నడిపే విషయంలో విద్యాశాఖ అధికారులు […]
ఈ నెల 17వ తేదీన హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వద్ద సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేపట్టిన దీక్ష బదులు ఉమ్మడి పోరాటం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. శనివారం నాడు జరిగిన జూమ్ మీటింగ్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ కార్యక్రమాల ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. […]
★ దేశవ్యాప్తంగా ఈరోజు 2,68,833 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు పార్లమెంట్‌లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 850కి చేరింది. వీరిలో 250 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు ★ ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 4, 955 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,01, 710 కి పెరిగింది. మరోవైపు ఏపీలో కరోనా […]
గుంటూరు జిల్లా నర్సరావుపేట టీడీపీ ఇంఛార్జి అరవింద్‌బాబుపై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరవింద్ బాబు ఆరోగ్య పరిస్థితిపై నేతలతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల అక్రమ అరెస్టులపై నిరసనలు తెలిపితే పోలీసులతో దాడి చేస్తారా అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులపై ప్రశ్నించిన అరవింద్‍బాబు, ఇతర నేతలపై పోలీసులు దౌర్జన్యం చేయడం వారి వైఖరికి నిదర్శనమన్నారు. టీడీపీ శ్రేణులపై వైసీపీ […]