హైదరాబాద్ నల్లగండ్ల అపర్ణ సరోవర్‌లో విషాదం నెలకొంది. చదువుకోమని తండ్రి మందలించడంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. చందానగర్ పీఎస్ పరిధిలోని నల్లగండ్ల అపర్ణ సరోవర్ సీ బ్లాక్ 14వ ఫ్లోర్‌లో అమిత్ కుటుంబం నివాసం ఉంటోంది. అమిత్ కుమారుడు అద్వైత్ (13) 8వ తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం అల్లరి చేస్తున్న విద్యార్థి అద్వైత్‌ను తండ్రి మందలించాడు. చదువుకోమని గట్టిగా అరిచాడు. దీంతో మనస్తాపం చెందిన అద్వైత్… 14వ […]
ఈరోజుల్లో పబ్లిసిటీలో కొత్త పుంతలు కనిపిస్తేనే కస్టమర్లను ఆకట్టుకునే అవకాశాలు ఉంటాయి. అంతేకానీ పాతచింతకాయ పచ్చడిలా ప్రకటనలు ఇస్తే చూస్తే రోజులు పోయాయి. అందుకే వ్యాపార సంస్థలు ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. తమ బ్రాండ్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఎంతకైనా తెగిస్తున్నాయి. అమూల్ సంస్థ ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివినట్లు కనిపిస్తోంది. ఇటీవల కోక్ ఇష్యూను తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం వాడుకున్న అమూల్.. ఇప్పుడు ఏకంగా ఓ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీని తమ […]
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 2017లో ఎరువులు ఉచితంగా ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు ఒక్కసారే ఎరువుల ధరలను 50 శాతం పెంచడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. Read Also: జంటనగరాల […]
భారత యువ షట్లర్ లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. ఇండియా ఓపెన్ 2022లో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సింగపూర్ ఆటగాడు, వరల్డ్ ఛాంపియన్ లొహ్ కియన్ యూని 24-21, 21-17 స్కోరు తేడాతో ఓడించాడు. లక్ష్యసేన్‌కు ఇదే తొలి టైటిల్. అంతేకాకుండా ఈ టైటిల్‌ను గెలుచుకున్న మూడో భారత పురుష ఆటగాడిగా లక్ష్యసేన్ నిలిచాడు. అతని కంటే ముందు 1981లో ప్రకాష్ పదుకొణె, ఆ తర్వాత 2015లో కిదాంబి శ్రీకాంత్ తొలి సూపర్ 500 ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను […]
బీహార్‌లో కల్తీ మద్యం కలకలం రేపింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ సొంత జిల్లా నలందలో సంక్రాంతి పండగ సందర్భంగా కల్తీ మద్యం తాగి 11 మంది మరణించారు. శనివారం ఆరుగురు మరణించగా… ఆదివారం మరో ఐదుగురు మరణించారు. బీహార్‌లో మద్యపాన నిషేధం అమలులో ఉన్నప్పటికీ కల్తీ మద్యం తాగి పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తుండటం గమనార్హం. 2016 నుంచి బీహార్‌లో మద్యపాన నిషేధం ఉండగా.. గత రెండు నెలల వ్యవధిలోనే కల్తీ మద్యానికి అలవాటు పడి […]
హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. జీడిమెట్ల పీఎస్ పరిధిలోని సుభాష్ నగర్ బస్టాప్ వద్ద బిద్యాధర్ (32) అనే వ్యక్తి ఏడాది నుంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతడి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పక్కనే యాసిన్ అనే వ్యక్తి పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి 10:30 గంటలకు బిద్యాధర్ వద్దకు వెళ్లిన యాసిన్ తనకు ఫాస్ట్ ఫుడ్ కావాలని అడిగాడు. రాత్రి అయినందున తాను షాపును మూసివేస్తున్నానని.. ఫాస్ట్ ఫుడ్ లేదని బిద్యాధర్ చెప్పాడు. […]
సొంత గడ్డపై జరిగిన యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ముగించింది. నామమాత్రంగా మిగిలిన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌పై 146 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. హోబర్ట్ వేదికగా జరిగిన చివరి టెస్టులో 271 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను 124 పరుగులకే ఆసీస్ బౌలర్లు ఆలౌట్ చేశారు. లక్ష్యఛేదనలో ఓ దశలో ఇంగ్లండ్ 68/0తో పటిష్టంగా కనిపించింది. అయితే 56 పరుగుల వ్యవధిలో 10 వికెట్లు కోల్పోయి మరో పరాజయం మూటగట్టుకుంది. […]
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈరోజు కొత్తగా 4,570 కేసులు వెలుగు చూశాయి. ఓ పక్క సామాన్యులు.. మరోవైపు రాజకీయ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో పలువురు రాజకీయ నేతలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. తాజాగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కరోనా బారిన పడ్డారు. దీంతో తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రకటించారు. ఇటీవల తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. […]
ఈనెల 17న హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో 36 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. సాంకేతిక కారణాలు, ట్రాక్ మరమ్మతుల నేపథ్యంలో పలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ జంట నగరాల పరిధిలో 79 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే అధికారులు నడుపుతున్నారు. అయితే ఈనెల 17న వాటిలో 36 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. Read Also: గోదారోళ్లతో మాములుగా ఉండదు… అల్లుడికి […]
గోదావరి జిల్లాలంటే మర్యాదలకు మారు పేరు. సాధారణంగానే గోదావరి జిల్లాలలో అతిథులకు చేసే మర్యాదలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఇక సంక్రాంతి అల్లుళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాలా? ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మనవరాలికి, ఆమెకు కాబోయే భర్తకు ఓ తాతయ్య ఇచ్చిన విందు భోజనం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. Read Also: ఏపీలో సెలవులు పొడిగించే ఆలోచన లేదు: మంత్రి సురేష్ నరసాపురానికి చెందిన ఆచంట గోవింద్ నాగమణి దంపతుల […]