కర్ణాటకలోని బెళగావి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామదుర్గ తాలూకా సాలహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా వికటించడంతో ఆదివారం నాడు ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. చిన్నారులకు తట్టు వ్యాధి నివారణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రుబెల్లా టీకాలు వేస్తుండటంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ టీకాలను వేయించారు.
Read Also: పండగ పూట విషాదం… కల్తీ కల్లు తాగి 11 మంది మృతి
అయితే రుబెల్లా టీకాలు వేసిన కాసేపటికే పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించినట్లు అధికారులు చెప్తున్నారు. దీంతో పరిస్థితి విషమించడంతో పవిత్ర హులగూర(13 నెలలు), మధు కరగుంది (14 నెలలు), చేతన్ పూజారి (15 నెలలు) అనే ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మరో చిన్నారి ఆరోగ్యం విషమంగా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.