ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ కల్లు తాగి ఐదుగురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. రాజవొమ్మంగి మండలం లొదొడ్డిలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తొలుత బుధవారం ఉదయం గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజనులు కల్లు తాగడానికి వెళ్లారు. అయితే వారు కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు వెంటనే బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. Read Also: ముందస్తు నోటీసులిచ్చి అడ్డుకోవడం కరెక్ట్ కాదు: సోము వీర్రాజు ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి […]
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 25న వస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే అంతకంటే ముందు ఆర్.ఆర్.ఆర్ సినిమాకు రెండు విడుదల తేదీలు ప్రకటిస్తూ సరికొత్త ట్రెండ్‌ను రాజమౌళి సృష్టించాడు. ఇప్పుడు ఇదే ఫార్ములాను పలు సినిమాలు ఫాలో అవుతున్నాయి. వారం రోజుల కిందట ఆర్.ఆర్.ఆర్ మూవీకి రెండు విడుదల తేదీలను […]
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. బడ్జెట్ కరోనాకు బూస్టర్ వ్యాక్సిన్ తరహాలో ఆశాజనకంగా ఉంటుందని భావించామని.. కానీ అలా లేదని తెలిపారు. పైకి అంకెలు చూడటానికి బాగున్నా బడ్జెట్ అంత ఉపయోగకరంగా అనిపించడంలేదని విజయసాయిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థికశాఖ ఫార్ములాతో ఏపీకి అన్యాయం జరుగుతుందన్నారు. పన్నుల వాటాల్లో ఏపీకి వచ్చేది రూ.4 వేల కోట్లేనని పెదవి విరిచారు. ఈ ఏడాది ఆర్థిక లోటు 6.4 శాతం ఉండొచ్చని కేంద్రమంత్రి […]
సీనియర్ నటి జయప్రద నివాసంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జయప్రద తల్లి నీలవేణి అనారోగ్యంతో మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొన్నిరోజులుగా నీలవేణి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తన అమ్మ చనిపోయిన విషయం తెలుసుకున్న నటి జయప్రద హుటాహుటిన ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. Read Also: ఈనెల 25న ఛార్జ్ తీసుకోబోతున్న ‘సెబాస్టియన్’ హీరోయిన్‌గా జయప్రద విజయం సాధించడం వెనక ఆమె తల్లి నీలవేణి ఉందని పలువురు సినీ ప్రముఖులు చెబుతుంటారు. […]
పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలు వాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారుడు సకిని రామచంద్రయ్యకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. ఆయన స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నివాసయోగ్యమైన ఇంటిస్థలం, నిర్మాణ ఖర్చుకు కోటి రూపాయల రివార్డును సీఎం కేసీఆర్ ప్రకటించారు. పద్మశ్రీ అవార్డును అందుకున్న నేపథ్యంలో మంగళవారం నాడు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను సకిని రామచంద్రయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. Read Also: దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి: సీఎం కేసీఆర్ ఈ […]
దాదాపు 24 ఏళ్ల తర్వాత కామన్ వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కింది. 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ కూడా ఉంది. మళ్లీ ఇప్పుడు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌కు అధికారులు చోటు కల్పించారు. జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. అయితే ఈసారి క్రికెట్‌లో మహిళల జట్లు మాత్రమే పోటీపడనున్నాయి. టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ పోటీలను నిర్వహించనున్నారు. Read Also: ఐపీఎల్ ఆటగాళ్ల […]
‘రాజావారు రాణి గారు’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం గత ఏడాది ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’తో కమర్షియల్ సక్సెస్ సాధించాడు. దాంతో నాలుగైదు సినిమాలలో అతనికి హీరోగా నటించే ఛాన్స్ దక్కింది. అగ్ర నిర్మాణ సంస్థలు సైతం ఇప్పుడు కిరణ్ అబ్బవరంతో సినిమాలు నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే కిరణ్ అబ్బవరం నటించిన మూడో చిత్రం ‘సెబాస్టియన్ పి.సి. 524’ విడుదల తేదీని నిర్మాతలు ప్రమోద్, రాజు మంగళవారం ప్రకటించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ […]
పీఆర్సీ అమలు విషయంలో ఏపీ ప్రభుత్వం తమను తప్పుదోవ పట్టిస్తోందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆరోపించారు. ఈరోజు జరిగిన చర్చల్లో మూడే అంశాలు చెప్పామని, మంత్రుల కమిటీ కొంత సమయం తర్వాత అభిప్రాయం చెప్తామని తమను మభ్యపెట్టిందని… సాయంత్రానికి తమ డిమాండ్లు సాధ్యపడవు అని ఒక సందేశంలో రూపంలో పంపిందని బండి శ్రీనివాసరావు తెలిపారు. మంత్రుల కమిటీతో చర్చలు విఫలమైనందున ఈనెల 3న తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులను భయపెట్టవద్దని, […]
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని పదే పదే చెప్తూ వస్తున్నారు. గతంలో మాదిరిగానే కేసీఆర్ ఈసారి కూడా తప్పకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని రేవంత్ జోస్యం చెప్పారు. అయితే తాము ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ ఈరోజు స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని ఆయన తెలిపారు. కావాలనే కొంతమంది సోషల్ మీడియాలో […]
దేశంలో గుణాత్మక మార్పు రావాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మార్పు కోసం ఏం చేయాలో అంతా చేస్తానని…ఈ అంశంపై అందరినీ కలుపుకుని వెళ్తానని కేసీఆర్ చెప్పారు. దీనిపై కొద్ది రోజుల్లోనే అన్ని విషయాలు ప్రకటిస్తానని తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను సెమీఫైనల్ అంటున్నారని… అయితే యూపీలో ఎవరు గెలిచినా ఈసారి బీజేపీకి సీట్లు అయితే తగ్గుతాయని కేసీఆర్ జోస్యం చెప్పారు. ఇది బీజేపీ పతనానికి నాంది పలుకుతుందన్నారు. దేశానికి కొత్త రాజ్యాగం కావాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం […]