కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ప్రవేశపెట్టిన ఆర్ధిక బడ్జెట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ బడ్జెట్ పనికిమాలిన, పసలేని బడ్జెట్ అని ఆయన విమర్శలు చేశారు. అన్ని వర్గాలను ఈ బడ్జెట్ తీవ్రంగా నిరాశకు గురిచేసిందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు పెట్టుకున్న ఆశలపై ఈ బడ్జెట్ నీళ్లు చల్లిందని… వేతన జీవుల కోసం ఇంకమ్‌ట్యాక్స్ శ్లాబులలో మార్పులు చేయకపోవడం విచారకరమని ఆయన అభిప్రాయపడ్డారు. Read Also: ప్రధాని మోదీ మరో రికార్డు.. ఈ […]
దేశవ్యాప్తంగా ప్రధాని మోదీకి ఆదరణ ఉందని ఇప్పటికే పలు సర్వేలు నిరూపించాయి. అయితే దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా మన ప్రధాని మోదీకి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మరో రికార్డు సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతల్లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న ఛానల్‌గా మోదీ యూట్యూబ్ ఛానల్ నిలిచింది. ఫిబ్రవరి 1 నాటికి ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబర్ల సంఖ్య కోటిని దాటింది. 2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో […]
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. కడప నుంచి విజయవాడ, చెన్నైకు విమాన సర్వీసులు నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకొచ్చింది. ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో ఈ మేరకు ఇండిగో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మార్గాల్లో విమానాలు నడిపిన ట్రూజెట్ సంస్థ తాము సర్వీసులు నడపలేమని ఒప్పందం రద్దు చేసుకోవడంతో ఇండిగోకు అధికారులు అవకాశం కల్పించారు. Read Also: ఏపీలో కార్యాలయం.. ఆర్బీఐ ఏం చెప్పిందంటే? తాజా ఒప్పందం దృష్ట్యా వయబిలిటీ గ్యాప్ […]
కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు బడ్జెట్-2022ను ఆవిష్కరించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ ప్రకారం కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. అలాగే కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. కొన్నింటిపై కస్టమ్ సుంకం తగ్గించగా.. కొన్నింటిపై కస్టమ్ సుంకం పెంచారు. అందువల్ల ధరల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ధరలు తగ్గే వస్తువుల జాబితా: మొబైల్ ఫోన్లు, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ ట్రాన్స్‌ఫార్మర్లు, వజ్రాలు, […]
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ మరో రికార్డు సృష్టించింది. గత ఏడాది జనవరిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా… ఇప్పటివరకు 165 కోట్ల డోసులను పంపిణీ చేశారు. దేశంలో 75 శాతానికి పైగా జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. అందరి కృషితో కరోనాను ఓడిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై […]
వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. కొత్త జిల్లాలపై ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను కొందరు ఏపీ సీఎం జగన్‌కు అన్వయిస్తున్నారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆమెను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఏపీ గురించి తనను అడగొద్దంటూ తెలంగాణలోని కొత్త జిల్లాల గురించి మాట్లాడారు. ఇక్కడ 33 జిల్లాలు ఏర్పాటు చేసి ఏం సాధించారని షర్మిల ప్రశ్నించారు. కనీసం 33 జిల్లాలకు కావాల్సిన సిబ్బందినైనా డిప్లాయ్ […]
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత పట్టాభి మరోసారి ఆరోపణలు చేశారు. జగనన్న గోరుముద్ద పథకంలో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని పట్టాభి ఆరోపించారు. ఈ పథకంలో 60 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని.. ఇవేమీ జగన్ తన జేబులో నుంచి తీసి ఇస్తున్న డబ్బులు కావన్నారు. అలాంటి కేంద్ర ప్రభుత్వ నిధులను ఏపీ సర్కారు పక్కదారి పట్టిస్తోందన్నారు. చిక్కీలు సరఫరా చేసే కేంద్ర కంపెనీని దిక్కుమాలిన కారణాలు చెప్పి డిస్ క్వాలిఫై చేశారని పట్టాభి విమర్శించారు. […]
టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్ ఎమ్మెల్సీ పదవీకాలం గడువు త్వరలోనే ముగుస్తుందని.. అందుకే లోకేష్ తిమ్మిరెక్కిన కాలును విదిలించినంత ఈజీగా నోరు పారేసుకుంటున్నాడని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ పదవి పోయిన తర్వాత లోకేష్‌కు ఏ పదవీ వచ్చేది లేదనే విషయం అర్థమైందని ఎద్దేవా చేశారు. అమరావతి పేరుతో రూ.లక్షల కోట్ల స్కామ్‌కు పాల్పడి అడ్డంగా దొరికాక అందరినీ భూఆక్రమణదారులుగా చిత్రీకరిస్తున్నాడంటూ లోకేష్‌పై […]
విజయవాడ నగరంలో ఇటీవల 9వ తరగతి చదువుతున్న బాలిక అపార్టుమెంట్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే టీడీపీ నేత వేధింపులు తాళలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ బాలిక సూసైడ్ నోట్ రాయడం సంచలనంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక ఉండే అపార్ట్‌మెంట్‌లోనే నివాసం ఉంటున్న టీడీపీ నేతను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా అతడి ఇంటిని కూడా సీజ్ చేశారు. Read Also: మొక్కే […]
రెండేళ్లుగా పెరుగుతున్న వంటనూనెల ధరలు ఇటీవల స్వల్పంగా తగ్గి పేదలకు ఊరట కలిగించాయి. అయితే ప్రస్తుతం దేశంలో నూనె పంటలు తగ్గడంతో వంట నూనెలకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సామాన్యుడికి మళ్లీ షాక్ తగలనుంది. మరోసారి వంట నూనెల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇండోనేషియా. భారత్‌కు ఎక్కువగా వంటనూనెలు ఇండోనేషియా నుంచే దిగుమతి అవుతున్నాయి. భవిష్యత్‌లో ఎగుమతులు తగ్గించుకోవాలని ఇండోనేషియా భావిస్తోంది. ఈ నిర్ణయం కారణంగా ఇండియాకు వంట […]