సీనియర్ నటి జయప్రద నివాసంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జయప్రద తల్లి నీలవేణి అనారోగ్యంతో మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొన్నిరోజులుగా నీలవేణి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తన అమ్మ చనిపోయిన విషయం తెలుసుకున్న నటి జయప్రద హుటాహుటిన ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు.
Read Also: ఈనెల 25న ఛార్జ్ తీసుకోబోతున్న ‘సెబాస్టియన్’
హీరోయిన్‌గా జయప్రద విజయం సాధించడం వెనక ఆమె తల్లి నీలవేణి ఉందని పలువురు సినీ ప్రముఖులు చెబుతుంటారు. జయప్రదను చూడగానే అంతులేని కథ, సిరిసిరిమువ్వ, సాగర సంగమం లాంటి కుటుంబ కథా చిత్రాలు గుర్తొస్తాయి. ఇలా జయప్రద కనిపించడం వెనుక నీలవేణి కృషి ఎంతో ఉంది. నటిగా తనకు అమ్మ నీలవేణి అన్ని విధాలుగా ప్రోత్సహించారని జయప్రద పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావిస్తూ ఉంటారు. కాగా జయప్రద తల్లి నీలవేణి మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.