దాదాపు 24 ఏళ్ల తర్వాత కామన్ వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కింది. 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ కూడా ఉంది. మళ్లీ ఇప్పుడు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌కు అధికారులు చోటు కల్పించారు. జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. అయితే ఈసారి క్రికెట్‌లో మహిళల జట్లు మాత్రమే పోటీపడనున్నాయి. టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ పోటీలను నిర్వహించనున్నారు.
Read Also: ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో మంత్రి పేరు.. ఆయన ధర ఎంతంటే?
కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళలు తొలిసారి క్రికెట్ ఆడబోతున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియా, భారత్, బార్బడోస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక జట్లు ఈ టోర్నీకి అర్హత సాధించినట్లు ఐసీసీ వెల్లడించింది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉండటం విశేషం. గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బార్బడోస్ జట్లు ఉండగా… గ్రూప్-బిలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్ పోటీ పడుతున్నాయి. మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనలిస్టులు ఆస్ట్రేలియా, భారత్ జట్లు జూలై 29న తలపడే మ్యాచ్‌తో కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయి.
🚨 The complete line-up of teams for cricket's return to Commonwealth Games in @birminghamcg22 is confirmed!#B2022 | Details 👇
— ICC (@ICC) February 1, 2022