CM Jagan: పోలీసులపై సీఎం జగన్ ఆగ్రహం.. విచారణకు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో శారదా పీఠం వార్షికోత్సవాల సందర్భంగా బుధవారం సీఎం జగన్ విశాఖలో పర్యటించారు. తన పర్యటన సందర్భంగా విశాఖ విమానాశ్రయం దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి ట్రాఫిక్ ఎందుకు నిలిపివేశారని, ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురిచేశారని పోలీసులను నిలదీశారు. ప్రజలకు అసౌకర్యం కల్గినందుకు చింతిస్తున్నానన్న జగన్.. దీనిపై విచారణ జరపాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశించారు.
కాగా బుధవారం సీఎం జగన్ రాక సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ నిలిపివేయడంతో పలువురు ప్రయాణికులు వాహనాలు దిగి లగేజీ పట్టుకుని పరిగెత్తుకుంటూ విమానాశ్రయానికి వెళ్లారు. సుమారు మూడు గంటల పాటు పోలీసులు ట్రాఫిక్ నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఏడీ జంక్షన్ నుంచి పెందుర్తి, కంచరపాలెం, గాజువాక, ఆర్టీసీ కాంప్లెక్స్ మార్గాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని స్థానికులు వాపోయారు.
Also Read
తాజావార్తలు
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!