ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో వాయిదా పడిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లానాయక్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారంటూ అభిమానుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అసలు ఈవెంట్ ఉంటుందా లేదా అన్న సందేహాలు అభిమానుల్లో కలుగుతున్నాయి. అయితే ఈనెల 23న హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ వేడుకకు మంత్రులు కేటీఆర్, తలసాని […]
ఏపీలో ఆర్టీసీకి చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. సాధారణంగా నిత్యం లక్షల లీటర్ల డీజిల్ వినియోగించే ఆర్టీసీకి చమురు కంపెనీలు బయట మార్కెట్ కంటే తక్కువ ధరకు డీజిల్‌ను సరఫరా చేస్తుంటాయి. అయితే 10 రోజులుగా బయట పెట్రోల్ బంకుల్లో విక్రయించే ధర కంటే ఆర్టీసీకి ఇచ్చే డీజిల్ ధర రూ.4.30 వరకు అదనంగా వడ్డిస్తున్నాయి. దీంతో ఆర్టీసీపై రూ.10 కోట్ల భారం పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులకు బయట పెట్రోల్ బంకుల్లో డీజిల్ […]
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో ప్రశ్నల ఛాయిస్‌ను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ప్రశ్నల సంఖ్యను కూడా గణనీయంగా పెంచింది. గతంలో కొన్ని సెక్షన్లలో మాత్రమే ఛాయిస్ ప్రశ్నలు ఇవ్వగా, ఈ ఏడాది అన్ని సెక్షన్లలో ప్రశ్నల సంఖ్యను పెంచి, ఛాయిస్‌గా వదిలేసుకొనే అవకాశం కల్పించింది. 2021-22 సంవత్సరానికి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాల మాదిరి ప్రశ్నపత్రాలను ఇంటర్ బోర్డు అధికారులు వెబ్‌సైట్‌లో పెట్టారు. గత ఏడాది మూడు సెక్షన్లకు […]
✪ నేటి నుంచి మార్చి 4 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఉ.8 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్న అర్చకులు.. స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్న శ్రీకాళహస్తి దేవస్థానం.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి నుంచి భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం.. మార్చి 5 నుంచి స్పర్శ దర్శనాలు పున:ప్రారంభం✪ ఈరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నేవీ హెలికాప్టర్ ద్వారా నెల్లూరుకు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తరలింపు.. […]
టీమిండియా 15 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. సుమారు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ టీ20ల్లో చివరి 5 ఓవర్లలో భారత్ అత్యధిక పరుగులు చేసింది. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో చివరి 5 ఓవర్లలో టీమిండియా 86 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్ చూడముచ్చటైన షాట్లతో అలరించి జట్టుకు భారీ స్కోరు అందించారు. కాగా 2007లో డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 80 పరుగులు, 2019లో బెంగళూరు వేదికగా […]
దాణా కుంభకోణం కేసులో బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఊహించని షాక్ తగిలింది. దాణా కుంభకోణానికి సంబంధించిన డోరండా ట్రెజరీ కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అంతేకాదు రూ. 60 లక్షల ఫీజు కూడా చెల్లించాలని రాంచీలోని సీబీఐ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. దాణా కుంభకోణానికి సంబంధించిన డోరండా ట్రెజరీ కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా పేర్కొంటూ గత […]
ఏపీ పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్‌లోని స్వగృహానికి తరలించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మేకపాటి గౌతమ్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించడం చాలా బాధాకరమని చంద్రబాబు అన్నారు. ఆయన వివాదాల జోలికి వెళ్లకుండా పనులు […]
మాతృభాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాతృభాషలో విద్యాబోధన చిన్నారుల మానసిక అభివృద్ధికి దోహద పడుతుందని పేర్కొన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మాతృభాషలో బోధన కొనసాగుతోందన్నారు. వైద్య, సాంకేతిక కోర్సులు సైతం మాతృభాషలో బోధించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రతిపాదించిన కార్యక్రమాల అమలుపైనా వెబినార్‌లో మోదీ ప్రసంగించారు. విద్యాశాఖకు సంబంధించి ఐదు అంశాలపై దృష్టిసారించినట్లు తెలిపారు. జాతీయ […]
కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా పేస్ బౌలర్ దీపక్ చాహర్ గాయపడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో కేవలం 1.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అప్పటికే రెండు వికెట్లు కూడా తీశాడు. అతడి రెండో ఓవర్ కోటాను ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్ పూర్తి చేశాడు. మళ్లీ దీపక్ చాహర్ బౌలింగ్‌కు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి శ్రీలకంతో ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌కు దీపక్ చాహర్ అందుబాటులో ఉండడం కష్టమేనని […]
ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల తెలంగాణ నేతలు సంతాపం తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సహా పలువురు నేతలు గౌతమ్‌రెడ్డి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి చనిపోయారన్న వార్త తెలుసుకుని దిగ్భ్రాంతికి గురైనట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కేటీఆర్ సానుభూతి తెలిపారు. గత 10 నుంచి 12 ఏళ్లుగా గౌతమ్‌రెడ్డితో తనకు పరిచయం ఉందని… రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్నోసార్లు […]