పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డ్రమ్స్ స్పెషలిస్ట్ శివమణి భీమ్లా నాయక్ మూవీలో పాటలకు పర్ఫార్మ్ చేస్తూ డ్రమ్స్ వాయించారు. వీరిద్దరూ కలిసి డ్రమ్స్ వాయిస్తూ ఉండగా శివమణి వెళ్లి హీరో పవన్ కళ్యాణ్‌ను, మంత్రి కేటీఆర్‌ను స్టేజీ మీదకు తీసుకొచ్చి వారితో డ్రమ్స్ వాయించేలా చేశారు. పవన్ కళ్యాణ్, కేటీఆర్ ఇద్దరూ కూడా డప్పు వాయించారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, కేటీఆర్ అభిమానులు కేరింతలు కొట్టారు.
కాగా ఈ మూవీలో పవన్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి త్రివిక్రమ్ మాటలు రాశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను భారీ వ్యయంతో నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్లతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.