పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ మూవీలో టైటిల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాటకు డ్యాన్స్ మాస్టర్ గణేష్ నృత్యరీతులు సమకూర్చారు. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డ్యాన్స్ చేసి పవర్‌స్టార్ అభిమానులను గణేష్ మాస్టర్ మెస్మరైజ్ చేశాడు. అనంతరం గణేష్ మాస్టర్ మాట్లాడుతూ.. భీమ్లా నాయక్ సినిమాలో ఓ స్పెషల్ ఉందని సీక్రెట్ రివీల్ చేశాడు. అది థియేటర్‌లోనే చూసి ఎంజాయ్ చేయాలని చెప్పుకొచ్చాడు.
అటు ఈ మూవీలో పవన్ కళ్యాణ్ చాలా కొత్తగా కనిపిస్తారని గణేష్ మాస్టర్ వెల్లడించాడు. తనకు బెస్ట్ సాంగ్స్ ఇస్తూ తనను ప్రోత్సహిస్తున్న పవన్ కల్యాణ్‌కు, ఈ అవకాశం కల్పించిన త్రివిక్రమ్, దర్శకుడు సాగర్ కె చంద్ర, నిర్మాత నాగవంశీకి ధన్యవాదాలు తెలిపాడు. పవన్‌తో కలిసి పనిచేయడం ఒక అద్భుతమన్నాడు. ఆ అద్భుతం తనకు కొన్ని సంవత్సరాలుగా దక్కుతుందన్నాడు. అందుకే దేవుడికి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువేనన్నాడు. తన జీవితాంతం పవన్‌కు రుణపడి ఉంటానని గణేష్ మాస్టర్ అభిప్రాయపడ్డాడు.