Statue Of Equality: సమతామూర్తి సందర్శన వేళలు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లోని సమతామూర్తి కేంద్రాన్ని దర్శించాలని భావించే భక్తుల కోసం నిర్వాహకులు సందర్శన వేళలను ప్రకటించారు. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులను అనుమతిస్తామని నిర్వాహకులు తెలిపారు. సమతామూర్తి కేంద్రానికి బుధవారం సెలవు ఉంటుందన్నారు. శని, ఆదివారాల్లో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శకులు సమతామూర్తిని దర్శించవచ్చని సూచించారు.
మార్చి 9వ తేదీ నుంచి ఈ టైమింగ్స్ అమల్లోకి వస్తాయని నిర్వాహకులు తెలియజేశారు. ప్రవేశ రుసుము 6-12 ఏళ్లలోపు పిల్లలకు రూ.75, పెద్దలకు రూ.150గా నిర్ణయించారు. ఐదేళ్లలోపు చిన్నారులను ఉచితంగా లోపలకు అనుమతి కల్పిస్తామన్నారు. కాగా సమతా మూర్తి కేంద్రానికి ఇటీవల శ్రీరామనగరంగా పేరు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. శ్రీరామనగరంలో 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు.
Also Read
- DA Release : తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్.!
- KTR: కరెంట్ కోతలపై కేటీఆర్ ఫైర్.. ‘ఇది ఎల్ నినో కాదు.. ఎల్ కాంగ్రెస్’.!
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
మరోవైపు సమతామూర్తి కేంద్రంలోని 120 కిలోల శ్రీరామానుజచార్యుల సువర్ణమూర్తి విగ్రహం దర్శనం, త్రీడీ మ్యాపింగ్ లేజర్ షో, ఫౌంటేన్ అందాలను నిర్వాహకులు తాత్కాలికంగా నిలిపివేశారు. బంగారు విగ్రహం చుట్టూ బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ ఫ్రేం ఏర్పాటు సహా ఇతరత్రా సాంకేతిక పనుల పూర్తికి మరో వారం రోజులు పడుతుండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
తాజావార్తలు
-
IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
-
BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
-
Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
-
Srikanth Odela: : నాని ‘జడల్’ లుక్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా?
-
DA Release : తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్.!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!