Kamal Haasan: ‘విక్రమ్’ షూటింగ్ పూర్తి.. పార్టీ లేదా అని అడిగిన ఫహద్ ఫాజిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వనటుడు కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు ఫస్ట్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘విక్రమ్’. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఈ విషయాన్ని దర్శకుడు లోకేష్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. చిన్నపాటి వీడియోను విడుదల చేస్తూ మూవీకి గుమ్మడికాయ కొట్టినట్టు చెప్పారు. విశేషం ఏమంటే… ఈ బుల్లి వీడియోలో ఫహద్ ఫాజిల్ గన్ పేల్చుతున్న విజువల్ ఉంది.
అనంతరం ఫహద్ ఫాజిల్ దర్శకుడు లోకేష్‌ను ఉద్దేశించి, ‘పార్టీ లేదా పుష్ప’ అనే డైలాగ్ చెప్పారు. ఇటీవల విడుదలై ‘పుష్ప’ సినిమాలో ఫహద్ చెప్పిన ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. అతని నుంచి ఆ డైలాగ్ వచ్చే సరికీ ‘విక్రమ్’ మూవీ యూనిట్ సభ్యులందరూ హర్షధ్వానాలు చేశారు. 110 రోజుల పాటు సినిమా షూటింగ్ జరిగిందని, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో అద్భుతంగా పనిచేశారని లోకేష్ అన్నారు. కమల్ హాసన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ సేతుపతి మెయిన్ విలన్‌గా నటించాడు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘విక్రమ్’ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read


After 110 days of shoot it’s a WRAP 🔥
Thanx to the entire cast and crew for the EXTRAORDINARY effort! 🙏🏻@ikamalhaasan @VijaySethuOffl #FahadhFaasil @anirudhofficial #VIKRAM pic.twitter.com/5xwiFTHaZH— Lokesh Kanagaraj (@Dir_Lokesh) March 1, 2022
తాజావార్తలు
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?