Kudankulam Nuclear Plant: కుడంకుళం అణు కేంద్రంలో డేటా లీక్?.. డార్క్ వెబ్‌లో బ్లూప్రింట్లు
- కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం డేటా లీక్..
- డార్క్ వెబ్‌లో పత్రాలను లీక్ చేసిన హ్యాకర్లు..
- ఘటనపై దర్యాప్తు చేపట్టిన ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kudankulam Nuclear Plant: భారతదేశంలో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రమైన తమిళనాడులోని కుడంకుళం ప్లాంట్ బ్లూఫ్రింట్స్ డార్క్ వెబ్‌లో లీక్ అయినట్లు తెలుస్తోంది. రాన్సమ్వేర్ గ్రూప్ ‘ వరల్డ్ లీక్స్’ ఈ ఫైళ్లను డార్క్ వెబ్‌లో పోస్ట్ చేసినట్లు రాయిటర్స్ నివేదించింది. ఈ ఫైళ్లలో అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించిన కొన్ని భాగాల బ్లూ ఫ్రింట్లతో పాటు సరఫరాదారుల వివరాలు ఉన్నాయని, ఈ సమాచారం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ నుంచి వచ్చిందని హ్యాకర్లు పేర్కొన్నారు.
భారత్‌లో 7 అణు విద్యుత్ కేంద్రాల్లో కుడంకుళం అతిపెద్దది. ఫ్లాంట్ కాంట్రాక్టర్లలో ఒకటైన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్, థర్డ్-పార్టీ ఇండియన్ డేటా సెంటర్ సర్వీస్ ప్రొవైడర్ యోటా హోస్ట్ చేసిన సర్వర్‌లో తమ డేటా పాక్షిక లీక్‌కు గురైనట్లు, ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసినట్లు రాయిటర్స్ పేర్కొంది. అయితే, ఏ డేటా లీక్ అయిందనే వివరాలను వెల్లడించలేదు. వరల్డ్ లీక్స్ వెబ్‌సైట్‌లోని మొత్తం 858,000 రిలయన్స్ ఫైళ్ళలో, 19,000 ఫైళ్ళు అత్యంత సున్నితమైనవిగా కనిపించాయి. అయితే, ఈ లీక్ అయిన పత్రాల్లో అణు రియాక్టర్ ప్రధాన వ్యవస్థలకు సంబంధించినవి కావని రాయిటర్స్ పేర్కొంది. లీక్ అయిన వాటిలో యూనిట్ 3, 4 లో ఉపయోగించిన వెంటిలేషన్, కూలింగ్ సిస్టమ్స్‌కు సంబంధించిన బ్లూప్రింట్లు ఉన్నట్లు సమాచారం. ఈ లీక్‌పై ప్రభుత్వం విచారణ చేపట్టినట్లు సమాచారం.
Also Read
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
- Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
- Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
తాజావార్తలు
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు