వనపర్తి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా వేదికగా మన ఊరు – మన బడి కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మన ఊరు – మన బడి పైలాన్‌ను సీఎం కేసీఆర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కలిసి ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. మన ఊరు మనబడి కార్యక్రమం రాష్ట్రంలోని విద్యారంగాన్ని పటిష్టం చేయనుందని కేసీఆర్ తెలిపారు. […]
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల తన కెరీర్‌లో 100వ టెస్టు ఆడాడు. ఈ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం స్టేడియం నుంచి హోటల్‌కు వెళ్తుండగా కోహ్లీ తన అభిమానికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. బస్సు ఎక్కుతున్న సమయంలో తన కోసం వేచి చూస్తున్న ఓ దివ్యాంగ అభిమానిని చూసి కోహ్లీ చలించిపోయాడు. ఈ నేపథ్యంలో తన అభిమాని ధరమ్‌వీర్ పాల్‌కు విరాట్ కోహ్లీ తన జెర్సీని బహుమతిగా […]
షేన్ వార్న్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వెల్లడించాడు. వార్న్ ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్ కాదంటూ ఈ సమయంలో తాను వ్యాఖ్యానించాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. నిజానికి ఇలాంటి సమయంలో టీవీ ఛానల్ వారు అలాంటి ప్రశ్న అడగాల్సింది కాదు.. తాను జవాబు చెప్పాల్సింది కాదని వివరించాడు. అయితే యాంకర్ అడిగిన ప్రశ్నకు తాను నిజాయితీగా తన అభిప్రాయం చెప్పినట్లు సన్నీ తెలిపాడు. క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లలో […]
పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ సింగరేణిలోని బొగ్గు గనిలో పైకప్పు కూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఏడుగురు పనిచేస్తుండగా ఒకరు మాత్రమే సురక్షితంగా బయటకు రాగా ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. తొలుత వారు మరణించారని ప్రచారం జరిగింది. అయితే సోమవారం రాత్రి సమయంలో ఇద్దరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. మరో నలుగురు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందం […]
ఏపీ రాజధాని విషయంలో మంత్రి బొత్స మరోసారి స్పందించారు. 2024 వరకు ఏపీకి రాజధాని హైదరాబాద్ అని ఆయన వ్యాఖ్యానించగా టీడీపీ నేతలు విమర్శలు చేశారు. దీంతో టీడీపీ నేతలపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి పొడుగు కావడం కాదు.. కొంచెం బుర్ర పెరగాలి అంటూ అచ్చెన్నాయుడిని ఉద్దేశించి బొత్స ఫైర్ అయ్యారు. చంద్రబాబు అండ్ ఫ్యామిలీ హైదరాబాద్‌లో ఉండి ఎంజాయ్ చేస్తారు కానీ తాము హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే మాత్రం టీడీపీ […]
మరికొద్దిరోజుల్లో ఐపీఎల్ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్‌కింగ్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. అయితే నెట్ బౌలర్‌గా ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్‌ను చెన్నై జట్టు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని క్రికెట్ ఐర్లాండ్ స్వయంగా వెల్లడించింది. ఈ లెఫ్టార్మ్ పేసర్‌కు ఈ అవకాశం మంచి అనుభవంగా మారాలని క్రికెట్ ఐర్లాండ్ ఆకాంక్షించింది. జోష్ లిటిల్ త్వరలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగనున్నాడు. […]
ఏపీ అసెంబ్లీలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంపై సీఎం జగన్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా కోసం దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి కన్న కలలను తాము సాకారం చేస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి గౌతమ్‌రెడ్డి పేరు పెట్టి ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా చేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ ప్రకటించారు. తన సహచరుడు, మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి లేడని ఊహించడం కష్టంగా ఉందని.. గౌతమ్ […]
ఏపీలో పోలీసులపై మాజీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో ఉన్నది పోలీసులా లేదా వైసీపీ రౌడీషీటర్లకు అనుచరులా అనే అనుమానాలు నెలకొన్నాయని లోకేష్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే నేరంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామ టీడీపీ కార్యకర్త కోన వెంకటరావును వేధించి ఆత్మహత్య చేసుకోవడానికి పోలీసులు కారణమయ్యారని లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియాలో పోస్టులు […]
తమిళనాడు మంత్రి శేఖర్‌బాబు కుమార్తె జయకళ్యాణి ప్రేమ వివాహం చేసుకుంది. బెంగళూరులోని హిందూ ధార్మిక సంస్థలో సోమవారం నాడు సతీష్అనే యువకుడితో మంత్రి కుమార్తె వివాహం జరిగింది. తమ ప్రేమకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇలా ప్రేమ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని జయకళ్యాణి వివరణ ఇచ్చింది. అయితే తన తండ్రి నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఆమెతో పాటు ఆమె భర్త సతీష్ పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. కొన్ని నెలల క్రితం […]
సిద్దార్థ్ శుక్లా.. పునీత్ రాజ్‌కుమార్.. ఏపీ మంత్రి గౌతం రెడ్డి.. తాజాగా షేన్ వార్న్.. వీళ్లే కాదు ఇలా ఎందరో.. ఫిట్‌నెస్ కోసం శ్రమించి… ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్లే. అయితే.. వీళ్ల మరణాలు ఏం చెప్తున్నాయి? జిమ్ చేయడం తప్పా? అతిగా శ్రమిస్తే.. హార్ట్ ఎటాక్ తప్పదా? ఎక్సర్‌సైజ్ చేస్తే.. ఆరోగ్యానికి మంచిదంటారు. మరి వీళ్ల ప్రాణాల మీదకు ఎందుకొచ్చింది? ఫిట్‌గా ఉండేందుకు రకరకాలుగా శ్రమిస్తున్న ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్న సమస్య ఇదే. గుండె పదిలంగా […]