Bangladesh Lynching: ‘‘గాజాపై కన్నీరు, హిందువు హత్యపై మౌనం ’’.. సెలబ్రిటీలను ప్రశ్నించిన జాన్వీ కపూర్, కాజల్ అగర్వాల్..
- బంగ్లాదేశ్‌లో హిందువుల హత్య..
- సెలబ్రిటీల మౌనాన్ని ప్రశ్నించిన జాన్వీ కపూర్, కాజల్ అగర్వాల్..
- గాజాపై కన్నీరు కార్చే వారు ఇప్పుడేమయ్యారు.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Lynching: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వరసగా మైనారిటీలను ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేస్తూ రాడికల్ ఇస్లామిస్ట్‌లు హత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల, బంగ్లాదేశ్‌లోని మైమన్‌సింగ్ జిల్లాలో దీపు చంద్ర దాస్ అనే 25 ఏళ్ల హిందూ వ్యక్తిని ‘‘దైవ దూషణ’’ ఆరోపణలపై మతోన్మాదులు కొట్టి చంపారు. శరీరాన్ని నగ్నంగా రోడ్డ పక్కన చెట్టుకు వేలాడదీసి, అంతా చూస్తుండగా నిప్పటించి చంపారు. ఈ ఘటన తర్వాత, పోలీస్ విచారణలో, దీపు దైవదూషణ చేసినట్లు ఆధారాలు లేవని తేలింది. ఈ ఘటన మరవక ముందే రాజ్‌బరి జిల్లాలో అమృత్ మండల్ అనే మరో హిందూ వ్యక్తిని కొట్టి చంపారు.
గాజాపై కన్నీరు, బంగ్లా హిందువులపై సెలబ్రిటీల మౌనం:
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
గాజాపై కన్నీరు కారుస్తూ, కొవ్వత్తి ర్యాలీలు చేపట్టే సెలబ్రిటీలు, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసపై మాత్రం పెదవి విప్పడం లేదు. సెలెక్టివ్‌గా స్పందించే మన సెలబ్రిటీల తీరును చాలా మంది విమర్శిస్తున్నారు. ఎక్కడో గాజాలో మారణహోమం జరిగితే ఎక్స్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో భావోద్వేగ మెసేజ్‌ల పెట్టే మన బాలీవుడ్ తారలకు బంగ్లా హింస కనిపించడం లేదు.
బంగ్లాపై స్పందించిన జాన్వీ కపూర్, మరికొంత మంది:
జాన్వీ కపూర్ వంటి కొంత మంది సెలబ్రిటీలు మాత్రమే ‘‘దీపు చంద్ర దాస్’’ హత్యై స్పందించారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ‘‘బంగ్లాదేశ్‌లో జరుగుతున్నది అనాగరికం. ఇది ఊచకోత, మరియు ఇది ఒక ఏకాకి సంఘటన కాదు. అతని అమానవీయ బహిరంగ మూకదాడి గురించి మీకు తెలియకపోతే, దాని గురించి చదవండి, వీడియోలు చూడండి, ప్రశ్నలు అడగండి. మరియు అయినప్పటికీ ఇవన్నీ చూసి మీకు కోపం రాకపోతే, ఇలాంటి కపటత్వమే మనకు తెలియకుండానే మనల్ని నాశనం చేస్తుంది. మన సొంత సోదరులు మరియు సోదరీమణులు దహనం చేయబడుతుండగా, మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయాల గురించి ఏడుస్తూనే ఉంటాం’’ అని ఆమె అన్నారు.
టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ కూడా బంగ్లాదేశ్ హిందువులకు తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్’’ పోస్టర్‌ను షేర్ చేశారు. ‘‘హిందువులారా మేల్కొనండి, నిశ్శబ్దం మిమ్మల్ని రక్షించదు’’ అని ఆమె కామెంట్ చేశారు.
సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద కూడా ఈ ఘటనపై మాట్లాడుతూ.. దీపు చంద్ర దాస్‌ను చంపిన క్రూరత్వం తన హృదయాన్ని రక్తసిక్తం చేసిందని అన్నారు. ‘‘ దీపు చంద్ర దాస్ అనే ఒక అమాయక హిందూ వ్యక్తిని మూకదాడి చేసి చంపారు. వారు అతన్ని చంపడమే కాకుండా, ఒక చెట్టుకు కట్టి నిప్పంటించారు. ఇదేనా కొత్త బంగ్లాదేశ్? ఇది సాధారణ హింస కాదు; ఇది మూకదాడి. ఇది హిందూ మతంపై దాడి. మన దేవాలయాలను కూల్చివేస్తున్నారు, మహిళలపై దాడులు జరుగుతున్నాయి, మనం ఇంకెంత కాలం మౌనంగా ఉంటాం? లౌకికవాదం పేరుతో మనం మౌనంగా ఉంటున్నాం, మనం మన గొంతులను వినిపించాలి, అక్కడి ప్రజలకు సహాయం చేయాలి… మనం అందరం కలిసి వారికి న్యాయం జరిగేలా ప్రయత్నించాలి’’ అని అన్నారు.
సినీ నటుడు మనోజ్ జోషి మాట్లాడుతూ.. గాజా లేదా పాలస్తీనాలో ఏదైనా జరిగితే అందరూ ముందుకు వస్తారు, కానీ బంగ్లాదేశ్‌లో ఒక హిందువును చంపింతే ఎవరూ ముందుకు రాకపోవడం చాలా బాధకరమని, దీనికి కాలమే సమాధానం చెబుతుందని అన్నారు. సింగర్ టోనీ కక్కర్, దాస్ హత్యను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. మత వివక్ష విడనాడాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!