Champion Collections: భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఛాంపియన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచిగానే కలెక్షన్లను రాబడుతుంది. భారీ స్థాయి నిర్మాణం, ఆకట్టుకునే కమర్షియల్ అంశాలు, విడుదలకు ముందు సాగిన ప్రమోషనల్ క్యాంపెయిన్ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇక విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 4.5 కోట్లకు పైగా గ్రాస్ సాధించడం విశేషం. ఇది హీరో రోషన్ మేకా కెరీర్‌లో కేవలం రెండో సోలో లీడ్ మూవీ కావడం గమనార్హం. పాజిటివ్ టాక్‌తో పాటు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా కలెక్షన్స్ కు మంచి ఊపు చూపిస్తున్నాయి.
బుక్‌మైషోలో తొలి 24 గంటల్లోనే 46 వేలకుపైగా టికెట్లు అమ్ముడవ్వగా.. విదేశీ మార్కెట్లలోనూ సినిమా మంచి రిజల్ట్స్ చూపించింది. ముఖ్యంగా అమెరికాలో సుమారు 75 వేల డాలర్ల గ్రాస్ సాధించింది. ఈ గణాంకాల ఆధారంగా ‘ఛాంపియన్’ క్రిస్మస్ విన్నర్‌గా నిలిచిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సినిమాపై క్రేజ్ పెరగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి మ్యూజిక్. విడుదలకు ముందే వైరల్ అయిన ‘గిరా గిరా’ పాట భారీ వ్యూస్‌తో ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించింది. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ అందించిన ఆల్బమ్ సినిమాకు అదనపు బలం చేకూర్చింది. ముందున్న వీకెండ్, న్యూ ఇయర్ సెలవులతో ‘ఛాంపియన్’ మరింత భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Gmail Address: గూగుల్ కొత్త ఫీచర్ విడుదల.. Gmail అడ్రస్ ఎలా మార్చుకోవాలంటే..?