ట్రాన్స్‌జెండర్లకు మన దేశంలో ప్రత్యేకమైన హక్కులున్నాయి. కానీ వారిని చాలా మంది చిన్నచూపు చూస్తుంటారు. ఉద్యోగాలలో తీసుకోవడానికి వెనుకాడుతుంటారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్ జెండర్లపై ఉన్న వ్యతిరేకత పోగొట్టే ఉద్దేశ్యంతో ముంబై వెర్సోవా ప్రాంతంలోని ఓ కేఫ్ వినూత్నంగా ఆలోచించింది. తమ కేఫ్‌లో పనిచేసే ఉద్యోగులుగా ట్రాన్స్‌జెండర్లనే నియమించుకుంది. ఈ కేఫ్ పేరు బాంబాయ్ నజారియా. ఈ కేఫ్ మోటో ‘నజారియా బదలో.. నజారా బద్‌లేగా’. అంటే ముందు నువ్వు మారు.. ఆ తర్వాత ఈ ప్రపంచమే […]
కొల్లాపూర్‌లో జరిగిన కాంగ్రెస్ మన ఊరు- మన పోరు కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. కేసీఆర్ సీఎం అయ్యి 8 ఏళ్లకు పైగా అవుతుందని.. అప్పటికీ, ఇప్పటికీ పాలమూరు మారిందా అని ప్రశ్నించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే పార్టీ మారి ఏం సాధించారని రేవంత్‌రెడ్డి నిలదీశారు. వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చుతానని కేసీఆర్ చెప్పారని.. ఆ విషయం ఏమైందని ప్రశ్నల వర్షం కురిపించారు.కేసీఆర్‌కు మాదిగల వర్గీకరణ […]
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకువెళ్తోంది. రెండో రోజు ఆటలో మరో 10 ఓవర్ల ఆట మిగిలి ఉండగా రెండో ఇన్నింగ్స్‌ను 303/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. రిషబ్ పంత్ (50), శ్రేయస్ అయ్యర్ (67) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. రోహిత్ (46), విహారి (35), జడేజా (22), మయాంక్ (22) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో జయవిక్రమ 4 వికెట్లు, ఎంబుల్‌దెనియా 3 వికెట్లు పడగొట్టారు. తొలి […]
ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 7 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ ఏడాది జంబ్లింగ్ విధానం లేకుండా పరీక్షలు జరపనున్నట్లు పేర్కొంది. సెకండియర్ విద్యార్థులంతా రేపటి నుంచి తమ హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా సూచించింది. కాగా ప్రాక్టికల్స్ పరీక్షలకు జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు గురువారం […]
భారత్ అమ్ములపొదిలో మరో శక్తివంతమైన క్షిపణి చేరనుంది. బ్రహ్మోస్ క్షిపణి ఇప్పటివరకు 300 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను మాత్రమే చేధించగలదు. అయితే త్వరలోనే 800 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్న శత్రు లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ అభివృద్ధి చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ శక్తివంతమైన క్షిపణిని గగనతలం నుంచి ప్రయోగించే విధంగా నిర్మిస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా ఇటీవల బ్రహ్మోస్ క్షిపణి సాంకేతిక లోపం కారణంగా పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన సంగతి […]
కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత వారం రోజులుగా చైనాలోని పలు నగరాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దక్షిణ చైనాలోని సాంకేతిక కేంద్రమైన షెన్‌జెన్‌లో తాజాగా అధికారులు కఠినమైన లాక్‌డౌన్ విధించారు. దీంతో షెన్‌జెన్ నగరంలోని 90 లక్షల మంది ప్రజలు ఇళ్లకు పరిమితం అయ్యారు. మరోవైపు దాదాపు 5లక్షల జనాభా ఉన్న షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని యుచెంగ్‌లో కూడా లాక్‌డౌన్ ఆంక్షలు జారీ చేశారు. రెండు రోజుల కిందట జిలిన్ […]
శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా దుమ్ము రేపుతోంది. ఈ టెస్టు ద్వారా టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులు సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్‌తో రోహిత్ 400 అంతర్జాతీయ మ్యాచ్‌ల ఘనతను అందుకున్నాడు, మరోవైపు వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టుల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసి 40 ఏళ్ల కిందటి కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు. బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ టీ20 తరహా బ్యాటింగ్‌తో లంక బౌలర్లకు […]
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న డే/నైట్ టెస్టులో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పటికే 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లోనూ మెరుగైన స్కోర్ దిశగా సాగుతోంది. అయితే ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిన సిక్సర్ కారణంగా స్టేడియంలోని ఓ అభిమాని గాయపడ్డాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో శ్రీలంక బౌలర్ విశ్వ ఫెర్నాండో వేసిన షార్ట్ పిచ్ బాల్‌కు రోహిత్ మిడ్ వికెట్ మీదుగా […]
టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం బెలిండా క్లార్క్ రికార్డ్ బ్రేక్ చేసింది. ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించి మిథాలీ రాజ్ రికార్డు క్రియేట్ చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ బెలిండా ఇప్పటివరకు 23 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించింది. అయితే న్యూజిలాండ్ వేదికగా సెడన్ పార్క్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో 24 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన మిథాలీరాజ్ […]