తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. నెల రోజుల వ్యవధిలో చికెన్ ధరలు డబుల్ అయ్యాయి. నెల క్రితం రూ.140 నుంచి రూ.160 వరకు పలికిన కిలో చికెన్ ధర.. ఇప్పుడు రూ.300కి చేరింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో చికెన్ ధర ఒక్కసారిగా పెరిగిపోవడంతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. సాధారణంగా వేసవి వచ్చిందంటే చికెన్ రేట్లు తగ్గుతాయి. వేసవి తాపానికి కోళ్లు చచ్చిపోతాయని పూర్తి బరువుకు రాకముందే కోళ్లను పౌల్ట్రీ రైతులు అమ్మేస్తుంటారు. దాంతో […]
సౌదీ అరేబియాలో సాధారణంగా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. తప్పు చేశారని నిరూపణ అయితే గుండు చేయడం, కాళ్లు, చేతులు తీసేయడం వంటివి ఆ దేశంలో చేస్తుంటారు. ఉరిశిక్షలు అమలు చేస్తున్న దేశాల్లో సౌదీ ఆరేబియా అగ్రస్థానంలో ఉందంటే అక్కడి ప్రభుత్వం నేరస్తుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రికార్డు స్థాయిలో ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష అమలు చేసింది. […]
విశాఖ వేదికగా జరిగిన బీజేపీ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ముఖ్యంగా వైసీపీ పాలనపై ప్రజలకు నమ్మకం పోయిందని.. ఏపీకి మంచి దిక్కు అవసరం అని ఆమె అభిప్రాయపడ్డారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం కార్యకర్తల సమిష్టి కృషి అని కార్యకర్తలను విశ్వసించే పార్టీ బీజేపీ ఒక్కటేనని చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లో విజయం స్ఫూర్తితో ఏపీలోని బీజేపీ కార్యకర్తలు, నేతలందరూ […]
ఏపీ జీవనాడి ప్రాజెక్టుగా పిలవబడుతున్న పోలవరం ప్రాజెక్టులో కీలకఘట్టం పూర్తయింది. స్పిల్ వేలో 48 రేడియల్ గేట్ల అమరిక పనులు పూర్తయ్యాయి. 2020 డిసెంబర్ 17న గేట్ల ఈ అమరిక పనులు ప్రారంభమయ్యాయి. గత సీజన్‌లో వరదలు వచ్చే నాటికి 42 గేట్లను అమర్చి, వరద నీటిని దిగువకు విడుదల చేశారు. మిగిలిన 6 గేట్ల అమరిక పనులు సైతం పూర్తి చేశారు. ఇప్పటికే రేడియల్ గేట్లకు అమర్చాల్సిన 96 హైడ్రాలిక్ సిలిండర్లకు 84 సిలిండర్లను అమర్చారు. […]
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామం పరిధిలో ఈనెల 14న జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. జనసేన పార్టీ స్థాపించి 8 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా నిర్వహించే ఈ సభకు రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరినీ ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి జనసైనికులు, వీర మహిళలు, రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించే అందరూ ఆహ్వానితులేనని పవన్ కళ్యాణ్ తెలిపారు. సభలో వీరమహిళలు కూర్చునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఏపీ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని జనసైనికులకు దిశానిర్దేశం […]
బెంగళూరు వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో (డే/నైట్) టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్సులో 109 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రీలంక బ్యాటర్లలో మథ్యూస్(43), డిక్‌వెల్లా(21) తప్ప ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు, అశ్విన్, షమీ తలో 2 వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. ఓవర్‌నైట్ స్కోరు 86/6తో రెండో రోజు ఆట ఆరంభించిన శ్రీలంకను చుట్టేయడానికి రోహిత్ సేనకు ఎంతో సమయం పట్టలేదు. […]
అంతర్జాతీయ ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడు శుక్రవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా క్యాన్సర్ నివారణ చికిత్సలు, అత్యాధుక విధానాలపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సమావేశంలో అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు అశోక్ కుమార్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలోని తిరుపతి, విశాఖ, గుంటూరు-విజయవాడ మధ్య క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్, తిరుపతిలో చిన్నారులకు క్యాన్సర్ కేర్ సెంటర్ ఏర్పాటుపై డీపీఆర్ సిద్ధం […]
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యం బాగోలేక శుక్రవారం యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ఆరోగ్యానికి ఏమైందంటూ పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఓ అభిమాని వినూత్న రీతిలో కాశీలోని విశ్వేశ్వరుడికి మొక్కులు చెల్లించుకున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాయి అనే అభిమాని ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో శుక్రవారం సాయంత్రం దీపారాధన […]
పాకిస్తాన్భూభాగంలోకి దూసుకెళ్లిన ఇండియా మిస్సైల్‌పై ఇరు దేశాల మధ్య ఆందోళన నెలకొంది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉప్పు-నిప్పుగా సాగే వ్యవహారాల్లో ఇప్పుడు ఈ మిసైల్ మిస్ ఫైర్ అంశం కొత్త వివాదం రేపుతోంది. ఇటీవల భారత సూపర్ సోనిక్ నిరాయుధ మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లింది. మార్చి 9న సాయంత్రం 6:43 గంటలకు భారత క్షిపణి తమ భూభాగంలోని మియా చన్ను ప్రాంతంలో పడిందని పాకిస్థాన్ తెలిపింది. ప్రాణ నష్టం జరగకపోయినా ఓ గోడ కూలిపోయిందని పాకిస్థాన్ ప్రభుత్వం […]
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో అంపైర్లు చేసిన తప్పిదం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ల నిర్లక్ష్యం కారణంగా ఒక ఓవర్‌లో బౌలర్ ఎలాంటి తప్పిదం చేయకుండానే ఏడు బంతులు వేసింది. వైడ్, నోబాల్స్ వేయకుండా ఒక బంతి ఎక్కువగా సంధించింది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 27వ ఓవర్ వేసిన పాకిస్థాన్ బౌలర్ ఒమైమా సోహైల్ ఆరు బంతులు బదులు ఏడు బంతులు వేసింది. ఈ ఓవర్ […]