సోషల్ మీడియాలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం ఆయన ప్రధాన ప్రతిపక్షం టీడీపీని విమర్శిస్తూ పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇటీవల సినిమా టిక్కెట్ రేట్లను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలో టిక్కెట్ రేట్లు ఎందుకు పెంచరంటూ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేయగా.. ఇప్పుడు టిక్కెట్ రేట్లు పెంచాక ఆయన ఎందుకు స్పందించడం లేదని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
‘సినిమా టికెట్ల రేట్లపై ప్రభుత్వం విధాన నిర్ణయం ప్రకటించింది. జీవో కూడా ఇచ్చింది. మొన్నటి వరకు టికెట్ రేట్లపై గొంతు చించుకున్న చంద్రబాబు నోరు ఇప్పుడు మూగబోయింది. బహుశా ఇంకో ఏడాదికో, ఎప్పుడో కొత్త మూవీ వచ్చే వరకు ఇంతేనేమో. ఇక హీరోలే లేనట్టు, వారివి సినిమాలే కానట్టు’ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాకు తప్ప చంద్రబాబు ఇతర హీరోల సినిమాల టిక్కెట్ రేట్లపై స్పందించరా అంటూ విజయసాయిరెడ్డి పరోక్షంగా విమర్శలు చేసినట్లు అర్ధమవుతోంది.
సినిమా టికెట్ల రేట్లపై ప్రభుత్వం విధాన నిర్ణయం ప్రకటించింది. జీఓ కూడా ఇచ్చింది. మొన్నటి వరకు టికెట్ రేట్లపై గొంతు చించుకున్న చంద్రబాబు నోరు ఇప్పుడు మూగబోయింది. బహుశా ఇంకో ఏడాదికో, ఎప్పుడో కొత్త మూవీ వచ్చే వరకు ఇంతేనేమో. ఇక హీరోలే లేనట్టు, వారివి సినిమాలే కానట్టు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 10, 2022
మరోవైపు బడ్జెట్‌పై టీడీపీ నేత నారా లోకేష్ విమర్శలు చేయడంపైనా ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు లోకేష్‌ను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘మోసకారి బడ్జెట్ అంటూ మాలోకం ‘వీరంగం’ చేస్తున్నాడు. మహామోసకారి ఎవరో గూగుల్‌లో కొట్టి చూడు. మీ తండ్రి పేరే కనిపిస్తుంది. అమ్మఒడి, వాహనమిత్ర, విద్యాదీవెన లబ్దిదారులను ఎప్పుడైనా కలిశావా చిట్టినాయుడూ? ఏ స్కీంనైనా అధ్యయనం చేశావా? మందబుద్ధితో కేటాయింపులపై మాట్లడటమేంటి చిట్టీ?’ అంటూ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
మోసకారి బడ్జెట్ అంటూ ‘వీరంగం’ చేస్తున్నాడు మాలోకం. మహామోసకారి ఎవరో గూగుల్ లో కొట్టి చూడు. మీ తండ్రి పేరే కనిపిస్తుంది. అమ్మఒడి, వాహనమిత్ర, విద్యాదీవెన లబ్దిదారులను ఎప్పుడైనా కలిశావా చిట్టినాయుడూ? ఏ స్కీంనైనా అధ్యయనం చేశావా? మందబుద్ధితో కేటాయింపులపై మాట్లడటమేంటి చిట్టీ?
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 11, 2022