Janasena Party: జనసేన ఆవిర్భావ సభకు విరాళాల సేకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 14న గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభను నిర్వహించాలని జనసేన పార్టీ తలపెట్టింది. ఈ మేరకు ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఆవిర్భావ వేడుకలకు తమ వంతు సహకరించాలని ప్రవాసాంధ్రులను కోరుతూ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు. నాదెండ్ల పిలుపునకు ఇతర దేశాల్లోని జనసైనికులు భారీగానే స్పందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న శ్రీనివాసులు అనే వ్యక్తి జనసేన ఆవిర్భావ వేడుకలకు తన వంతుగా రూ.లక్షను విరాళంగా పంపించారు. ఈ మేరకు శ్రీనివాసులు పంపిన మొత్తం తమకు అందిందని పార్టీ ఆవిర్భావ వేడుకలకు తన వంతుగా సహకరించిన శ్రీనివాసులుకు ధన్యవాదాలు చెబుతూ జనసేన ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టింది.
Also Read

అటు జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయేలా సభను నిర్వహిస్తామని నాదెండ్ల మనోహర్ శుక్రవారం రోజు వెల్లడించారు. ఈ మేరకు మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సభావేదిక నుంచి భవిష్యత్తు కార్యాచరణ, పార్టీపరంగా తీసుకోవాల్సిన కొన్ని రాజకీయ నిర్ణయాలపై పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారని తెలిపారు. రాజకీయ పార్టీ అంటే ఒక బృంద ప్రయత్నమని, కలిసికట్టుగా జనసైనికులు ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఏయే గ్రామాల్లో జన సైనికులు ఉత్సాహంగా పని చేస్తున్నారో గమనించి వారికి ఎన్‌ఆర్‌ఐ మద్దతుదారుల ఉడతాసాయంగా అండగా నిలిస్తే అది పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!