Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నలుగురు మహిళలకు కేబినెట్‌లో చోటిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొల్లాపూర్‌లో జరిగిన కాంగ్రెస్ మన ఊరు- మన పోరు కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. కేసీఆర్ సీఎం అయ్యి 8 ఏళ్లకు పైగా అవుతుందని.. అప్పటికీ, ఇప్పటికీ పాలమూరు మారిందా అని ప్రశ్నించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే పార్టీ మారి ఏం సాధించారని రేవంత్‌రెడ్డి నిలదీశారు. వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చుతానని కేసీఆర్ చెప్పారని.. ఆ విషయం ఏమైందని ప్రశ్నల వర్షం కురిపించారు.కేసీఆర్‌కు మాదిగల వర్గీకరణ చేసే ఉద్దేశ్యం లేదన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ జరగాలంటే పాలమూరులో 14 సీట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. అటు ముదిరాజ్‌లకు కూడా కేసీఆర్ న్యాయం చేయలేదని.. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక్క ముదిరాజ్‌ను బొందపెట్టారని ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాల్లో భాగంగానే కేసీఆర్ ఉద్యోగాల నాటకానికి తెరతీశారని రేవంత్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇస్తున్నానని రేవంత్ తెలిపారు. నలుగురు మహిళలకు కేబినెట్‌లో చోటు కల్పిస్తామన్నారు. పాలమూరు జిల్లాలోని 20 లక్షల ఎకరాలకు నీరు అందించే వరకు తాము నిద్రపోమన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్, జూరాల, ఎస్ఎల్‌బీసీ పనులన్నీ పూర్తి చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.
Also Read
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్‌లో అత్యధిక పెట్రోల్ ధర!
- Hyderabad: పక్కా ప్లాన్‌తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్‌లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
తాజావార్తలు
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!