Tragedy : నగరంలోని కాచిగూడలో గుండెలవిసే విషాదం చోటుచేసుకుంది. ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన భారీ అగ్నిప్రమాదం ఒక చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకోగా, మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కళ్ళముందే పసికందులు మంటల్లో చిక్కుకోవడం చూసి ఆ కుటుంబం గుండెలవిసేలా రోదిస్తోంది. మంటల్లో చిక్కుకున్న కవలలు కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందర్ నగర్‌లో సైఫుద్దీన్ ఖాదిరి అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఆయనకు రహీం, రెహమాన్ అనే మూడేళ్ల కవల పిల్లలు ఉన్నారు. శుక్రవారం వారి ఇంట్లోని ఏసీలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు ఇల్లంతా వ్యాపించడంతో లోపల ఉన్న కవల పిల్లలు బయటకు రాలేక అందులోనే చిక్కుకుపోయారు.
Mega Victory Mass Song: మెగా విక్టరీ మాస్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్..
ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం ఈ ఘోర ప్రమాదంలో రహీం అనే చిన్నారి మంటల ధాటికి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన మరో బాలుడు రెహమాన్‌ను గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రాణాలకు తెగించి బయటకు తీసుకువచ్చారు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రెహమాన్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
పోలీసుల దర్యాప్తు ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఏసీలో సాంకేతిక లోపం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సుందర్ నగర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘోర ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
Garuda AI Bike : సూరత్ విద్యార్థుల అద్భుత సృష్టి.. తుక్కు సామాన్లతో ‘గరుడ’ AI సూపర్‌బైక్..