టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ లేమితో సతమతం అవుతున్నాడు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందు కనీసం హాఫ్ సెంచరీలైనా చేస్తున్నాడని అభిమానులు మురిసిపోయారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కోహ్లీ దారుణంగా విఫలమవుతున్నాడు. సెంచరీ సంగతి పక్కన బెడితే… కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. టెస్టు కెరీర్‌లో కోహ్లీ సగటు ఏకంగా 50కి దిగువకు పడిపోయింది. దీంతో ఇన్నాళ్లు 3 ఫార్మాట్లలో 50కి పైగా సగటుతో ఉన్న కోహ్లీ ప్రస్తుతం ఆ […]
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికకు ఒకే నామినేషన్ రావడంతో గుత్తా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి అధికారులు తెలిపారు. కమ్యూనిస్టుగా రాజకీయాల్లోకి వచ్చిన గుత్తా సుఖేందర్‌రెడ్డి 2004లో టీడీపీ తరపున నల్గొండ ఎంపీగా గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తరఫున అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2019లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గెలుపొందారు. శాసనమండలి ఛైర్మన్‌గా రెండోసారి పదవీ […]
తాను వివాహం చేసుకున్న మహిళ ఆడది కాదంటూ ఓ భర్త సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మెడికల్ రిపోర్టు ప్రకారం ఆమె ఆడది కాదని, తాను మోసపోయానని, ఆమె నుండి విడాకులు ఇప్పించాలంటూ పిటిషన్ ద్వారా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి విజ్ఞప్తి చేశాడు. 2016లో తమకు వివాహం అయిందని, ఆమె రుతుక్రమం కారణంగా తనకు దూరంగా ఉందని, అనంతరం ఆమె తన వద్దకు తిరిగి వచ్చిందని పిటిషన్‌లో భర్త పేర్కొన్నాడు. ఆమెతో […]
తెలంగాణలో త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. టెట్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని ఆమె తెలిపారు. దీంతో త్వరలో టెట్ నిర్వహణకు చర్యలు తీసుకుంటామని మంత్రి సబిత వెల్లడించారు. అలాగే ఉద్యోగ అభ్యర్థుల కోసం ప్రతి యూనివర్సిటీ పరిధిలో ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల నియామకాలను సైతం త్వరలో చేపడతామన్నారు. మరోవైపు మన ఊరు మన బడి కార్యక్రమం కింద […]
ఏపీ అసెంబ్లీలో జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై రగడ జరుగుతోంది. ఈ అంశంపై సభలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఇంటింటికి నీళ్లు ఇచ్చిందో లేదో కానీ లిక్కర్ మాత్రం ఇచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో ఎద్దేవా చేశారు. ATM (ఎనీ టైమ్ మందు) అనేలా చంద్రబాబు పాలన సాగిందని […]
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జగడం జరుగుతోంది. జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ పలుమార్లు సభను వాయిదా వేశారు. అయితే ఈ అంశంపై చర్చించాల్సిందేనని టీడీపీ నేతలు పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేపట్టారు. సభలో టీడీపీ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ సభ్యులను ఉద్దేశిస్తూ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. మద్యపాన నిషేధం గురించి […]
సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు ఈనెల 28,29 తేదీల్లో సార్వత్రిక సమ్మె చేపట్టనున్నారు. దీనికి సంబంధించి కార్మిక సంఘాలు సోమవారం ఉదయం సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందించారు. ఈ మేరకు ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్,ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్ కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు సమర్పించాయి. సింగరేణిలో నాలుగు బ్లాకులు కళ్యాణిఖని బ్లాక్ 6, కొయ్యగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణి పల్లి […]
సాధారణంగా మనం చెప్పులు లేకుండా నడవడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఓ కళాకారిణి ఏకంగా చెప్పులు లేకుండా 9,999 మేకులపై కూచిపూడి నృత్యం చేసి అందరినీ అబ్బురపరిచింది. అంతేకాకుండా పలు ప్రపంచ రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన ఓ కార్యక్రమంలో యువ నర్తకి పీసపాటి లిఖిత 9 నిమిషాలపాటు అమ్మవారిని స్తుతిస్తూ చేసిన కూచిపూడి నృత్యం అలరించింది. ముఖ్యంగా తొమ్మిది దుర్గావతారాలను లయబద్ధంగా […]
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం కొనసాగనున్నాయి. ఈరోజు బడ్జెట్‌పై ఉభయసభల్లో చర్చ జరగనుంది. అటు అసెంబ్లీలో ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల బిల్లుతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ పెంపు బిల్లు, మద్యం అమ్మకాల చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. మరోవైపు మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాల తీర్మానంపై జరిగే చర్చలో సీఎం జగన్ పాల్గొననున్నారు. కాగా అసెంబ్లీలో నేడు జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై సభలో టీడీపీ వాయిదా తీర్మానం […]