కెనడాలోని టొరంటోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మృతి చెందారు. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీని ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు భారతీయ విద్యార్థుల సహా మరో ఇద్దరు గాయపడ్డారని, వారిని ఆస్పత్రికి తరలించామని కెనడాలోని భారత రాయబారి అజయ్ బైసారియా వెల్లడించారు. బాధితుల స్నేహితులతో ఎంబసీ అధికారులు టచ్‌లో ఉన్నారని తెలిపారు. బాధితుల కుటుంబాలకు అన్ని విధాలుగా సహకరిస్తామని పేర్కొన్నారు. కాగా మృతులను హర్‌ప్రీత్ సింగ్, […]
హైదరాబాద్ నగరంలో అందరూ ఎదురుచూస్తున్న ఎయిర్ షో త్వరలోనే ప్రారంభం కానుంది. ఈనెల 24 నుంచి వింగ్స్ ఇండియా-2022 పేరుతో ఎయిర్ షోను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్‌పోర్టు వేదికగా పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన అత్యాధునిక విమానాలు, జెట్లు, హెలికాప్టర్లు నగరవాసులను కనువిందు చేయనున్నాయి. నాలుగు రోజుల పాటు ఈ ప్రదర్శనలు కొనసాగనున్నాయి. కరోనా కారణంగా నాలుగేళ్ల విరామం అనంతరం ఈ ఎయిర్ షోను నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో దాదాపు […]
ఏపీలో మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్‌వాడీ కార్మికులు నేడు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సోమవారం సెలవును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎల్‌పీవో, ఎంపీడీవో, ఈవోపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులకు సెలవు మంజూరు చేయవద్దని కలెక్టర్లు ఆయా శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేసి స్కానింగ్ ప్రతులను ఉ.10:45 గంటల్లోగా ఉన్నతాధికారులకు పంపించాలని, హెడ్‌క్వార్టర్లు విడిచిపెట్టి వెళ్లరాదని ఆదేశించారు. మరోవైపు […]
చిత్తూరు జిల్లాలోని ఓ కుటుంబానికి పాము గండం పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో పాము పేరు చెప్తే చాలు ఆ కుటుంబం వణికిపోతోంది. 45 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఆరుసార్లు పాము కాటేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. చంద్రగిరి మండలం దోర్నకంబాల పంచాయతీ మల్లయ్యపల్లి ఆంధ్రవాడకు చెందిన వెంకటేష్, తన భార్య వెంకటమ్మ, కుమారుడు జగదీష్ తండ్రితో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ అటవీప్రాంతం సమీపంలోని కొట్టంలో జీవనం సాగిస్తున్నారు. […]
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 80వేల ఉద్యోగ నియామకాలకు సంబంధించి తొలి నోటిఫికేషన్ పోలీస్ శాఖ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ పోలీసు శాఖలో 18,334 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ప్రభుత్వం ఈ వారంలో గ్రీన్‌సిగ్నల్ ఇస్తే.. ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీస్ శాఖ నుంచి ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలో తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్, సివిల్, ఆర్మ్‌డ్(ఏఆర్), కమ్యూనికేషన్ విభాగాల్లో […]
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామ పరిధిలో నేడు జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగ జరగనుంది. ఈ సభ ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరై ప్రసంగించనున్నారు. సభకు హాజరయ్యే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా 2024 ఎన్నికలకు జనసేన ఎలా ముందుకెళ్తుంది, ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారు అనే […]
మేషం: ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు అభివృద్ధి పొందుతారు. సంఘంలో గుర్తింపు గౌరవం పొందుతారు. వ్యాపారాభివృద్ధికి కావలసిన ప్రణాళికలు అమలు చేస్తారు. పీచు, నార, ఫోము, లెదర్ వ్యాపారస్థులకు యోగప్రదం. మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. వృషభం: వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ఎంతో ముఖ్యం. కమ్యూనికేషన్, కంప్యూటర్, వైజ్ఞానిక రంగాలలో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ప్రముఖులతో మితంగా సంభాషించటం శ్రేయస్కరం. పెద్ద […]
★ గుంటూరు: నేడు ఇప్పటం గ్రామ పరిధిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. సభా ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య పేరు… సభకు హాజరుకానున్న పవన్ కళ్యాణ్.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న జనసేన బహిరంగ సభ★ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. నాటుసారా మృతుల కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు★ నేడు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు.. సీఐటీయూ ఆధ్వర్యంలో ఛలో విజయవాడ.. నోటీసులు ఇచ్చి కార్మికులను ఎక్కడికక్కడ […]
కొంతమంది పగలు మొత్తం విపరీతంగా పనిచేసి రాత్రిళ్లు ఫుల్లుగా తినేస్తుంటారు. కానీ రాత్రిళ్లు ఎక్కువ మొత్తంలో తినడం మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందులోనూ కొన్నిరకాల ఆహారాలు అసలు తినకూడదని చెప్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో తీసుకునే కొన్ని ఆహారాలు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ✪ బీట్‌రూట్: బీట్‌రూట్ చాలా పోషకాలున్న వెజిటేబుల్. కానీ రాత్రి వేళ దీన్ని తినడం మంచిది కాదు. ఎందుకంటే రాత్రిపూట బీట్‌రూట్ తినడం వల్ల మీ రక్తంలో చక్కెర […]