ట్రాన్స్‌జెండర్లకు మన దేశంలో ప్రత్యేకమైన హక్కులున్నాయి. కానీ వారిని చాలా మంది చిన్నచూపు చూస్తుంటారు. ఉద్యోగాలలో తీసుకోవడానికి వెనుకాడుతుంటారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్ జెండర్లపై ఉన్న వ్యతిరేకత పోగొట్టే ఉద్దేశ్యంతో ముంబై వెర్సోవా ప్రాంతంలోని ఓ కేఫ్ వినూత్నంగా ఆలోచించింది. తమ కేఫ్‌లో పనిచేసే ఉద్యోగులుగా ట్రాన్స్‌జెండర్లనే నియమించుకుంది. ఈ కేఫ్ పేరు బాంబాయ్ నజారియా. ఈ కేఫ్ మోటో ‘నజారియా బదలో.. నజారా బద్‌లేగా’. అంటే ముందు నువ్వు మారు.. ఆ తర్వాత ఈ ప్రపంచమే మారుతుందని దీని అర్థం.
ట్రాన్స్‌జెండర్లను మాత్రమే విధుల్లోకి తీసుకోవడంతో ఈ కేఫ్ తెగ ఫేమస్ అయిపోయింది. ట్రాన్స్‌జెండర్స్‌కు ఒక దారి చూపించిన ఈ కేఫ్ ఓనర్‌కు స్థానికులు జేజేలు పలుకుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ కేఫ్ గురించి చాలామంది వీడియోలు తీసి పోస్ట్ చేశారు. ఈ కేఫ్‌కు సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌గా మారాయి.