World Record: 9,999 మేకులపై 9 నిమిషాల పాటు కూచిపూడి నృత్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా మనం చెప్పులు లేకుండా నడవడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఓ కళాకారిణి ఏకంగా చెప్పులు లేకుండా 9,999 మేకులపై కూచిపూడి నృత్యం చేసి అందరినీ అబ్బురపరిచింది. అంతేకాకుండా పలు ప్రపంచ రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన ఓ కార్యక్రమంలో యువ నర్తకి పీసపాటి లిఖిత 9 నిమిషాలపాటు అమ్మవారిని స్తుతిస్తూ చేసిన కూచిపూడి నృత్యం అలరించింది.
ముఖ్యంగా తొమ్మిది దుర్గావతారాలను లయబద్ధంగా కళ్లకు కట్టినట్లు చూపింది. దీంతో ఒకేసారి పది ప్రపంచ రికార్డులను సాధించింది. ఆయా రికార్డుల ప్రతినిధులు ఆమెకు సర్టిఫికెట్లు అందించి ఘనంగా సత్కరించారు. కాగా ఎన్టీఆర్ కళామందిరంలో నిర్వహించిన వరల్డ్ రికార్డ్స్, భారత్ వరల్డ్ రికార్డ్స్, టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ట్రెడిషనల్ వరల్డ్ రికార్డ్స్, వండర్ ఇండియా రికార్డ్స్, ఢిల్లీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, సంస్కృతి సంప్రదాయ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, సకల కళాకారుల ప్రపంచ పుస్తకం, ఎక్స్ట్రాడినరీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ప్రైడ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం యువ నర్తకి లిఖిత కూచిపూడి నృత్యం చేసింది.
Also Read
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!