యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీలో నాలుగేళ్ల కోర్సు, 8 సెమిస్టర్ల విధానానికి యూజీసీ గురువారం నాడు ఆమోదం పలికింది. ఈ నాలుగేళ్లలో ఒక్కో సెమిస్టర్ కాల వ్యవధి 90 రోజులు ఉంటుంది. మొదటి మూడు సెమిస్టర్లలో మ్యాథ్స్, సోషల్, హ్యూమానిటీస్, వృత్తి విద్య వంటి సబ్జెక్టులు ఉంటాయని యూజీసీ తెలిపింది. మూడో సెమిస్టర్ ముగిసిన తర్వాత మేజర్, మైనర్ సబ్జెక్టులను విద్యార్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల ఆసక్తి, అప్పటివరకు విద్యార్థులు చూపిన […]
ఐపీఎల్-15 సీజన్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ పృథ్వీ షా యోయో టెస్టులో విఫలమయ్యాడు. ఫిట్‌నెస్ టెస్టులో విఫలం కావడంతో మెగా టోర్నీకి అతడు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. యోయో టెస్టులో ప్రతి ఆటగాడు కనీసం 16.5 స్కోరు సాధించాల్సి ఉంది. ఈ స్కోరు సాధించకపోతే ఐపీఎల్‌లోకి నిర్వాహకులు అనుమతించరు. ఇదే యోయో టెస్టులో ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా పాస్ మార్కులతో బయటపడినట్లు తెలుస్తోంది. హార్డిక్ 17కు […]
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలు శాంసంగ్, వన్‌ప్లస్ వినియోగదారులకు క్షమాపణలు చెప్పాయి. స్మార్ట్ ఫోన్‌లలో యాప్ థ్రాట్లింగ్ జరుగుతుండటంపై సదరు కంపెనీలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఫోన్‌లలో గేమింగ్ పర్ఫార్మెన్స్ పెంచడడం కోసం సదరు సంస్థలు ప్లే స్టోర్‌లలోనే వివిధ యాప్‌ల పనితీరు సామర్థ్యాన్ని తగ్గించి చూపెడుతున్నాయి. దీంతో బ్యాటరీ లైఫ్‌ను పెంచడంతో పాటు గేమ్‌లకు అనువుగా సాఫ్ట్‌వేర్‌ను మరింత శక్తివంతంగా మారుస్తున్నాయి. ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22తో పాటు గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8 […]
భారత్‌లో రోజురోజుకు కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,568 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇదే సమయంలో 4,722 మంది కరోనా నుంచి కోలుకోగా 97 మంది మృతి చెందారు. ఒకవైపు కరోనా కేసులు తగ్గుతున్నా మరణాల సంఖ్య మాత్రం పెరగడం గమనార్హం. ముందురోజు 27గా ఉన్న మరణాల సంఖ్య… 24 గంటల వ్యవధిలోనే 97కి పెరిగింది. కొన్నిరోజులుగా ఇండియాలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నా మరణాల విషయంలో మాత్రం హెచ్చుతగ్గులు వస్తున్నాయి. తాజాగా […]
సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్వీన్ స్వీప్ చేసింది. ఈ రెండు టెస్టులు మూడు రోజుల్లోనే ముగిసిపోయాయి. ఈ సిరీస్ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ తన స్థానాన్ని మెరుగుపరచుకుంది. 58 శాతం విజయాలతో ఐదు నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. డబ్ల్యూటీసీలో భాగంగా ఇప్పటివరకు నాలుగు సిరీస్‌లు ఆడిన టీమిండియా ఆరు విజయాలు సాధించింది. మూడు మ్యాచ్‌లలో ఓడిపోయింది. రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. మొత్తంగా […]
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది. స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు అంటూ స్పష్టం చేసింది. ఇస్లాం మతపరంగా అంతగా ముఖ్యమైన అంశం కాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ రితూ రాజ్ అవస్థి నేతృత్వంలో జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ జేఎస్ ఖాజీలతో కూడిన ధర్మానం ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది. […]
జనసేన ఆవిర్భావ సభలో తనపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. పవన్ కళ్యాణ్ కేవలం సినిమాల్లోనే హీరో.. పొలిటికల్‌గా తాను హీరోనని మంత్రి అవంతి అన్నారు. పవన్‌కు అహంభావం ఎక్కువ అని.. అతడి సినిమాల్లో విజయాల కంటే ఎక్కువ పరాజయాలే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం తప్ప పవన్ వాస్తవాలు తెలుసుకోరా అంటూ ప్రశ్నించారు. మరోవైపు తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా గత మూడేళ్ల కాలంలో జనసేన కార్యకర్తలపై […]
పంజాబ్‌లోని జలంధర్‌లో దారుణం జరిగింది. కబడ్డీ ప్రపంచంలో ఛాంపియన్‌గా నిలిచిన అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు, ఇండియన్ స్టార్ సందీప్ నంగల్ సోమవారం దారుణహత్యకు గురయ్యాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే సందీప్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. దాదాపు 20 రౌండ్ల కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అయితే ఈ హత్యకు గల కారణాలపై జలంధర్ పోలీసులు విచారణ చేపట్టారు. కబడ్డీ సమాఖ్యలో గొడవల కారణంగా సందీప్‌ను హత్య జరిగి ఉండవచ్చని డీఎస్పీ లఖ్వీందర్ సింగ్ అనుమానం […]
ఏపీలో వేసవి తాపం మొదలైపోయింది. వారం రోజుల నుంచి పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. మంగళ, బుధవారాల్లో కూడా వడగాల్పులు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం రాష్ట్రంలోని 20 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు, గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాలలోని […]
రష్యా దాడులతో ఉక్రెయిన్ విలవిల్లాడుతోంది. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై క్షిపణి దాడులతో రష్యా బలగాలు మారణహోమం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మేరియుపోల్ నగరంలో పరిస్థితులు దారుణంగా మారాయి. అక్కడ శవాల గుట్టలు అంతకంతకూ పేరుకుపోతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 2,500 మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు ఒలెక్సీ అరిస్టోవిచ్ వెల్లడించారు. మేరియుపోల్‌కు చేరుకునే మానవతా సాయాన్ని కూడా రష్యా అడ్డుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన రెండు రోజుల్లోనే మరణాల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పారు. రష్యా దాడులు […]