ఏపీలో గత మూడేళ్లుగా నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నట్లు సోమవారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీలో గత ఐదేళ్లలో 294 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఆయన వివరించారు. 2017లో 55 మంది, 2016లో 36 మంది, 2017లో 55 మంది, 2018లో 44 మంది, 2019లో 71 మంది, 2020లో 88 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మరోవైపు తెలంగాణలో మాత్రం […]
సొంతగడ్డపై టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. గత పదేళ్లుగా టీమిండియా సొంతగడ్డపై ఏ జట్టు కూడా భారత్‌ను ఓడించలేకపోయింది. ఈ నేపథ్యంలో స్వదేశంలో వరుసగా 15 సిరీస్‌లను గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. భారత్ తర్వాత స్వదేశంలో అత్యధిక టెస్ట్ సిరీస్‌లను గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆసీస్ స్వదేశంలో వరుసగా 10 టెస్ట్ సిరీస్‌లను తమ ఖాతాలో వేసుకుంది. 1994 నవంబర్ నుంచి 2000 నవంబర్ మధ్యలో ఒకసారి, 2004 జూలై నుంచి […]
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 7న ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టగా.. 9న సాధారణ బడ్జెట్‌పై చర్చ జరిగింది. అలాగే తర్వాతి నాలుగు రోజుల్లో బడ్జెట్ పద్దులపై చర్చ జరిగింది. మొత్తంగా 37 పద్దులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈరోజు చివరి రోజు కాబట్టి.. నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీ, మండలిలో చర్చ జరగనుంది. ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందిన తర్వాత.. ఎఫ్ఆర్ఎంబీ, […]
హైదరాబాద్ జేఎన్టీయూలో ఈనెల 15, 16 తేదీల్లో మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 150 కంపెనీలు పాల్గొంటున్నాయని యూనివర్సిటీ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ సురేష్ వెల్లడించారు. ఆసక్తిగల నిరుద్యోగులు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. పదో తరగతి నుంచి టెక్నాలజీ విద్య వరకు అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చని తెలిపారు. అన్ని రకాల కంపెనీలు పాల్గొంటున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సాధారణ డిగ్రీలు […]
సినీ నటుడు, అలనాటి హీరో సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మరో రెండుసార్లు జగన్ సీఎంగా కొనసాగితే రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ జవహర్‌నగర్‌లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని తెలిపారు. మూడు దఫాలు ముఖ్యమంత్రిగా ఒకే వ్యక్తికి అవకాశం ఇస్తే రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నవరత్నాలతో పేదల్లో చిరునవ్వును నింపిందని సుమన్ అన్నారు. మరోవైపు […]
మేషం: ఆడిట్, అకౌంట్స్, కంప్యూటర్ రంగాల వారికి పనిభారం అధికం. ఫ్యాన్సీ, కిరణా, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. చేపట్టిన పనులు ఎంతో శ్రమించిన కాని పూర్తికావు. సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాటపడవలసి వస్తుంది. వృషభం: భాగస్వామికులతో చర్చలు ఫలించవు. ఉద్యోగస్తులకు పనిభారం అధికం. ఏ నిర్ణయం తీసుకోవటానికి ధైర్యం చాలదు. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. లక్ష్యసాధనకు బాగా శ్రమించాలి. దుబారా ఖర్చులు తెలియకుండానే అవుతాయి. వస్త్ర, […]
★ నేడు సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్★ తిరుమల: నేడు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో మూడో రోజు.. ఈరోజు తెప్పలపై విహరించనున్న శ్రీదేవి భూదేవి సమేతుడు మలయప్పస్వామి★ నేడు ఏపీ అసెంబ్లీ ముందుకు వ్యాట్ సవరణ బిల్లు… నేటితో ముగియనున్న బడ్జెట్‌పై చర్చ.. మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే ప్రతిపాదనపై సమాధానం చెప్పనున్న సీఎం జగన్★ నేటితో ముగియనున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. నేడు […]
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ దారుణహత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం రాత్రి విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏ దుర్గం బాబు(50)ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. దీంతో రక్తం మడుగులో ఉన్న వీఆర్ఏను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం […]
ఏపీ అసెంబ్లీలో సోమవారం గందరగోళం నెలకొంది. ప.గో. జిల్లా జంగారెడ్డిగూడెం సారా మరణాలపై టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సభలో ప్రశ్నోత్తరాలు జరగకుండా అడ్డుకున్నారు. అనంతరం స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ తమ్మినేని కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, బాలవీరాంజనేయులును బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేశారు. వారిని సభ నుంచి […]