Ramesh Nalam
Author- NTV Telugu-
Asia Cup 2022: ఆసియా కప్‌కు ముహూర్తం ఫిక్స్.. శ్రీలంక వేదికగా టోర్నమెంట్
వివిధ కారణాల వల్ల నాలుగేళ్లుగా నిర్వహించలేకపోయిన ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను తిరిగి ఈ ఏడాది ప్రారంభించాలని ఆసియా కప్ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. శ్రీలంక వేదికగా ఆగస్టు 27 నుంచి ఆసియా కప్‌ను నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆసియా కప్‌ను నిర్వహిస్తుండటంతో ఈసారి టీ20 ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుంది. ఆసియా కప్‌లో టీమిండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్ జట్లతో పాటు మరో టీమ్ కూడా పాల్గొననుంది. […] -
Andhra Pradesh: ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వాస్పత్రుల్లో బయోమెట్రిక్ హాజరు
ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది కోసం బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా, భోధన, ప్రాంతీయ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ విధానం ఉంటుందని తెలిపింది. బయోమెట్రిక్ హాజరు అమలు కోసం ఆస్పత్రుల్లో సీసీటీవీలను ఏర్పాటు చేసింది. డ్యూటీకి వచ్చి పర్మిషన్ లేకుండా బయటకు వెళ్తే సెలవుల్లో కోత ఉంటుందని ఏపీ ప్రభుత్వం […] -
Dharmana Krishnadas: జగన్ మళ్లీ సీఎం కాకపోతే.. నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తా
శ్రీకాకుళం జిల్లా పోలాకి, చెల్లాయి వలసలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శనివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మరోసారి సీఎం అవుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు టీడీపీ నేతలకు ధర్మాన కృష్ణదాస్ సవాల్ విసిరారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం కాకుండా తన ఆస్తులు మొత్తం రాసిచ్చేస్తానని […] -
RRR Mania: గ్యాస్ సిలిండర్ కొంటే.. ఆర్.ఆర్.ఆర్ సినిమా టిక్కెట్లు ఉచితం
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్.ఆర్.ఆర్ సినిమా మేనియా నడుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ మూవీ ఈనెల 25న విడుదల కానుంది. ఈ సినిమా టిక్కెట్ బుకింగ్స్ అప్పుడే ప్రారంభం కాగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు వ్యాపారులు ఆర్.ఆర్.ఆర్ మూవీ క్రేజ్‌ను వినియోగించుకుంటున్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ వినూత్నంగా ఆలోచించింది. సింగిల్ గ్యాస్ సిలిండర్ కలిగిన వినియోగదారులు […] -
Womens World Cup: ఆసీస్‌పై భారత్ ఓటమి.. సెమీస్ అవకాశాలు సంక్లిష్టం
మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. శనివారం నాడు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత మహిళలు ఓటమి పాలయ్యారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసింది. మిథాలీరాజ్ (68), యస్తికా భాటియా (59), హర్మన్ ప్రీత్‌కౌర్ (57 […] -
Maxwell Marriage: ఓ ఇంటి వాడైన మ్యాక్స్‌వెల్.. విషెస్ తెలిపిన ఆర్సీబీ
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ శుక్రవారం నాడు తన గర్ల్‌ఫ్రెండ్, భారతీయ యువతి వినీ రామన్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని మ్యాక్స్‌వెల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తమిళనాడుకు చెందిన వినీ రామన్‌తో ప్రేమలో ఉన్న అతడు.. 2020 ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం చేసుకున్నాడు. అయితే కరోనా కారణంగా మ్యాక్స్‌వెల్ పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. కాగా మ్యాక్స్‌వెల్-వినీ రామన్ జంటకు ఆస్ట్రేలియా క్రికెటర్లు, బెంగళూరు రాయల్ […] -
Sunrisers Hyderabad: కేన్ మామ గాయం వార్తలు ఫేక్.. ఇదిగో వీడియో..!!
మరో వారం రోజుల్లో ఐపీఎల్-15 సీజన్ ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటి నుంచే అన్ని జట్లు మైదానంలోకి అడుగుపెట్టి ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో ఇంకా బాధపడుతున్నాడని.. అతడు ప్రారంభ మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడని ప్రచారం జరుగుతోంది. గత ఏడాదితో భారత్‌తో టెస్ట్ సిరీస్ అనంతరం కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో అతడు ఫిట్‌గా లేడని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే సన్‌రైజర్స్ […] -
Meghalaya High Court: మహిళను అలా తాకినా అత్యాచారం చేసినట్లే..!!
మేఘాలయ హైకోర్టు గురువారం నాడు కీలక తీర్పు వెల్లడించింది. మహిళ జననాంగాన్ని లోదుస్తులపై నుంచి పురుషాంగంతో తాకినా అత్యాచారంగానే పరిగణించాలని స్పష్టం చేసింది. 2006లో పదేళ్ల బాలిక తనపై అత్యాచారం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. 2018లో నిందితుడికి ట్రయల్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధించింది. అప్పుడు నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. అనంతరం నిందితుడు ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ […] -
Pawan Kalyan: భారతీయుల ఐక్యతకు ప్రతీక హోలీ పండుగ
ఈనెల 18న హోలీ పండగను పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయుల ఐక్యతకు ప్రతీకగా నిలిచే హోలీని దేశ ప్రజలందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. హోలీ వేడుకల ప్రాశస్త్యాన్ని ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువు వేళ వచ్చే హోలీని వసంతోత్సవంగా కూడా పిలుస్తారని పవన్ పేర్కొన్నారు. వేర్వేరు ప్రాంతాల ప్రజలు హోలీ వేడుకలను వేర్వేరు రీతుల్లో జరుపుకుంటారని ఆయన తెలిపారు. […] -
UPSC: సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?
అఖిల భారత సర్వీసు అధికారుల ఎంపిక కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతి ఏడాది సివిల్స్ పరీక్షను మూడు దశల్లో నిర్వహిస్తుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూల దశల్లో ఉద్యోగులను భర్తీ చేస్తుంది. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో భాగంగా మెయిన్స్‌కు సంబంధించిన ఫలితాలను గురువారం సాయంత్రం యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి పలు సర్వీసు అధికారులుగా ఎంపిక అవుతారు. సివిల్ సర్వీసెస్-2021లో భాగంగా ప్రిలిమ్స్‌లో […]
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!