శ్రీకాకుళం జిల్లా పోలాకి, చెల్లాయి వలసలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శనివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మరోసారి సీఎం అవుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు టీడీపీ నేతలకు ధర్మాన కృష్ణదాస్ సవాల్ విసిరారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం కాకుండా తన ఆస్తులు మొత్తం రాసిచ్చేస్తానని తెలిపారు. రాష్ట్రానికి వైఎస్ జగన్ లాంటి నేత నభూతో నభవిష్యత్ అని అభివర్ణించారు. సీఎం జగర్ ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారని.. ఈ ప్రకారం తాను ప్రతి ఇంటికి వస్తానని తెలిపారు.
కాగా 2019 ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు కూడా విజయం సాధించినా ధర్మాన కృష్ణదాస్‌కు సీఎం జగన్ మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారు.