Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్‌పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
- CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది..
- రాహుల్ గాంధీకి మాజీ మిత్రపక్షం ఘాటు లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: అస్సాంకు చెందిన కాంగ్రెస్ మాజీ మిత్రపక్షం రైజోర్ దళ్ అధినేత అఖిల్ గొగోయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజమైన ప్రజా ఉద్యమాన్ని కాంగ్రెస్ చీల్చిందని, దీని ద్వారా బీజేపీకి ఆ ఉద్యమాన్ని నియంత్రించే అవకాశం కల్పించిందని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలు, ప్రజా ఉద్యమాలనే కాంగ్రెస్ తన ప్రధాన ప్రత్యర్థులుగా భావిస్తోందని రాహుల్ గాంధీకి అఖిల్ గొగోయ్ ఘాటు లేఖ రాశారు. కాంగ్రెస్ రైజోర్ దళ్‌తో సంబంధాలు తెంచుకున్న 2 నెలల తర్వాత ఆయన ఈ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
CJP ఉద్యమాన్ని బలహీనం చేసింది కాంగ్రెసే..
రాహుల్ గాంధీకి రాసిన లేఖలో కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ(CJP) చేపట్టిన నిరసనలకు సమాంతరంగా కాంగ్రెస్ కూడా వేరే ఆందోళనలు నిర్వహించడం వల్ల ఉద్యమంలో ఐక్యత దెబ్బతిందని చెప్పారు. దీంతో అధికారంలో ఉన్న పాలకులు ఈ ఉద్యమాన్ని నియంత్రించేందుకు అవకాశం కలిగిందని అన్నారు. నిర్ణయాత్మక పోరాటానికి దేశానికి లభించిన అత్యుత్తమ అవకాశాన్ని వృథా చేసిందని తన లేఖలో అఖిల్ గొగోయ్ దుయ్యబట్టారు.
Also Read
- Viral Video: క్వాడ్ సమావేశంలో జాతీయ జెండాకు గౌరవం.. మోడీ చేసిన పని వైరల్..
- Cyclone Akvan: ఆంధ్రప్రదేశ్ వైపే వరస తుఫానులు.. బంగాళాఖాతంలో అసలేం జరుగుతోంది.?
- Quad Summit: మోడీ ‘‘టఫ్ మ్యాన్’’.. ప్రధానిపై ట్రంప్ ప్రశంసలు!
- Rahul Gandhi: 'నాన్న ఒడిలో అమ్మ కూర్చునేది'.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో రాజకీయ వివాదం..
అఖిల్ గొగోయ్ లేఖలో రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్, అఖిల భారత విద్యార్థి సంఘం (AISA) అధ్యక్షురాలు నేహా బోరా, వామపక్ష నాయకులపైనా ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌కు ఉపయోగపడేలా వీరంతా సమాంతర ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతించారని, తద్వారా CJP ఉద్యమాన్ని బలహీనపరిచారని ఆయన విమర్శించారు.
గత సెప్టెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ రైజోర్ దళ్‌తో పొత్తును వదులుకుంది. కూటమి నైతికతను ఉల్లంఘించడం, కూటమి ఐక్యతను దెబ్బతీయడం వంటి కారణాలను చూపుతూ కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. పొత్తులో భాగంగా 13 సీట్లు కోరిన రైజోయ్ దళ్‌కు కేవలం 4 సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధపడిందని అఖిల్ గొగోయ్ ఆరోపించారు. అసోం కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్‌పై అఖిల్ విమర్శలు చేశారు. ఆయన అహంకారపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. కూటమి భాగస్వాములతో సంప్రదింపులు జరపకుండానే కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను ఏకపక్షంగా సిద్ధం చేసిందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్‌పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
-
RCB: రిటెన్షన్ తర్వాత ఆర్బీసీ పరిస్థితి ఇదీ.. ఎవరున్నారు..? ఎవరు వెళ్లారు..?
-
OTR: కౌశిక్‌పై ఫిర్యాదు.. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలన్న స్పీకర్!
-
IPL 2027: పూర్తయిన రిటెన్షన్ ప్రక్రియ.. ఎవరి పర్సులో ఎంత..? టాప్‌లో LSG..
-
OTR: ఆలేరు కాంగ్రెస్ పార్టీలో వీధికెక్కిన కుమ్ములాటలు
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!