Kishan Reddy: అప్పులు చేసి ఏపీ రాష్ట్రాన్ని ఎన్నాళ్లు నెట్టుకొస్తారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కడపలో బీజేపీ రాయలసీమ రణభేరి సభకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏపీ అప్పుల రాష్ట్రంగా మారిపోయిందని ఆరోపించారు. ఎక్కడ అప్పులు పుడతాయా అనే స్థితిలోకి ఏపీ వెళ్లిపోయిందని.. అప్పులు చేసి రాష్ట్రాన్ని ఎన్నాళ్లు నెట్టుకొస్తారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో పాలన ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని వ్యాఖ్యానించారు.
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కిషన్‌రెడ్డి స్పందించారు. సీమ అభివృద్ధి కోసం జగన్ ఏం చేశారో చెప్పాలన్నారు. రాయలసీమకు రతనాలసీమ అని పేరు ఉందని… అలాంటి రతనాల సీమ ఈ రోజు వెనుకబడిపోయిందని కిషన్‌రెడ్డి తెలిపారు. సీమ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేయలేదని ఆయన విమర్శలు చేశారు. ఏపీలో బీజేపీలో చేరేవారిని ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కాగా అంతకుముందు కడప చేరుకున్న కిషన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శాలువా కప్పి ఆత్మీయంగా స్వాగతం పలికారు.
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
మరోవైపు ఏపీ మాజీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ ఏపీలో భూముల కబ్జా పైనే వైసీపీ నేతల కన్ను ఉందని ఆరోపించారు. కేంద్రం నిధులిస్తున్నా వెనుకబడిన ప్రాంతాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో లిక్కర్, ల్యాండ్ మాఫియా రాజ్యమేలుతోందన్నారు. అనేక వనరులు ఉన్న రాయలసీమను, రాయలసీమలోని ప్రాజెక్టులను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. రాయలసీమలో 20 లక్షల ఎకరాలకు నీరివ్వాలి కానీ 7 లక్షల ఎకరాలనే స్థిరీకరించారని ఆయన ఆరోపించారు.
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!